దేశమంతా చీకటి.. ఇంటర్నెట్ కట్..
డమాస్కస్: తరచుగా ఉగ్రదాడులతో సతమతమయ్యే సిరియా తాజాగా మరో సమస్యను ఎదుర్కొంటుంది. ఆ దేశం గురువారం నాడు అంధకారంలో ఉండి పోయిందట. అదేవిధంగా దేశవ్యాప్తంగా ఇంటర్నెట్ సేవలు నిలిచిపోయి ప్రజలు చాలా ఇబ్బందిపడ్డారని ఓ అధికారిక ప్రకటనలో ఈ వివరాలను అధికారులు వెల్లడించారు. అన్ని గవర్నరేట్లలోనూ పవర్ కట్స్ ఉన్నాయని, ఇంటర్నెట్ సేవలు తాత్కాలికంగా రద్దయ్యాయని వివరించారు.
విద్యుత్ శాఖ అధికారులు పవర్ కట్ కారణాలు కనుక్కొవడానికి ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఇది ఎవరైనా కావాలని ప్లాన్ ప్రకారం చేశారా.. లేక సాంకేతిక కారణాల వల్ల ఈ సమస్యలు తలెత్తాయా అనే కోణాల్లో అధికారులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కారణాలు మాత్రం ఇంకా తెలియరాలేదు.