
సాక్షి, హైదరాబాద్: కేంద్రమంత్రి, రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు కిషన్ రెడ్డికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బుధవారం ఫోన్ చేశారు. తెలంగాణకు రావాల్సిన నిధులు, ఇతర అంశాలపై పరస్పర సహకారం ఉండాలని ఆయనను సీఎం కోరారు. త్వరలోనే కేంద్ర ప్రభుత్వ ముఖ్యులతో సమావేశం ఏర్పాటు చేసేలా చొరవ చూపాలని కిషన్ రెడ్డికి సీఎం విజ్ఞప్తి చేశారు. తెలంగాణ అభివృద్ధి విషయంలో పూర్తి సహాయసహకారాలు అందించాలన్నారు.
కాగా, సీఎం రేవంత్ రెడ్డి ధరణిపై సమీక్ష నిర్వహించారు. ధరణి లోటుపాట్లపై వారం, పదిరోజుల్లో నివేదిక ఇవ్వాలని సీసీఎల్ కమిషనర్ నవీన్ మిట్టల్‌ను ఆదేశించారు. వ్యవసాయ, వ్యవసాయేతర భూముల వివరాలు నివేదికలో పొందుపరచాలన్న సీఎం.. ధరణి యాప్ భద్రతపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ధరణి లావాదేవీలపై వస్తున్న విమర్శలకు డాటా రూపంలో వివరణ ఇవ్వాలని అధికారులను సీఎం ఆదేశించారు.
ఇదీ చదవండి: తెలంగాణకు తొలి దళిత స్పీకర్.. రేపే అధికారిక ప్రకటన
Comments
Please login to add a commentAdd a comment