న్యూఢిల్లీ: దేశీయంగా మరిన్ని ఉత్పత్తులకు నాణ్యతా ప్రమాణాలను తప్పనిసరి చేయనున్నట్లు కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి పియుష్ గోయల్ తెలిపారు. 2047 నాటికి భారత్ సంపన్న దేశంగా ఎదగాలని లక్ష్యంగా పెట్టుకున్న నేపథ్యంలో దీనిపై మరింతగా దృష్టి పెట్టనున్నట్లు ఆయన చెప్పారు. భారతీయ ప్రమాణాల బ్యూరో (బీఐఎస్) 77వ వ్యవస్థాపక దినోత్సవంలో వర్చువల్‌గా పాల్గొన్న సందర్భంగా మంత్రి ఈ విషయాలు తెలిపారు.
క్వాలిటీ కంట్రోల్ ఆర్డర్ (క్యూసీవో) ద్వారా తప్పనిసరిగా పాటించాల్సిన నాణ్యతా ప్రమాణాల పరిధిలోకి మరిన్ని ఉత్పత్తులను తేవడం వల్ల వినియోగదారులకు ఆయా ఉత్పత్తులు, సర్వీసుల లభ్యత మెరుగుపడిందని మంత్రి చెప్పారు. ఇప్పటివరకు 672 ఉత్పత్తులతో 156 క్యూసీవోలు జారీ అయ్యాయని, రాబోయే రోజుల్లో 2,000–2,500 ఉత్పత్తులు క్యూసీవోల పరిధిలోకి చేరతాయని ఆయన పేర్కొన్నారు.
ఇటీవలి కాలంలో ప్రభుత్వం .. బంగారు ఆభరణాల హాల్‌మార్కింగ్, ఆట»ొమ్మలకు నాణ్యతా ప్రమాణాలను నిర్దేశించడం మొదలైన చర్యలు తీసుకుందని మంత్రి చెప్పారు. భారత్ ఉన్నత లక్ష్యాలను సాధించేందుకు, సంపన్న దేశంగా ఎదిగేందుకు ఉత్పత్తులు, సరీ్వసులపరంగా అత్యున్నత నాణ్యతా ప్రమాణాలు తోడ్పడగలవని ఆయన చెప్పారు. ఆ దిశగా నాణ్యతా ప్రమాణాలకు బీఐఎస్ ప్రచారకర్తగా మారాలని సూచించారు. సాధ్యమైనంత వరకు అంతర్జాతీయ ప్రమాణాలకు దీటుగా బీఐఎస్ దేశీయంగా నాణ్యతా ప్రమాణాలను రూపొందించాలని గోయల్ చెప్పారు. లిఫ్టులు, ఎయిర్ ఫిల్టర్లు, వైద్య పరికరాలు మొదలైన ఉత్పత్తుల విషయంలో భారత్ ప్రపంచ స్థాయి ప్రమాణాలను నిర్దేశించడానికి అవకాశం ఉందని ఆయన తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment