న్యూఢిల్లీ: దేశంతో గత తొమ్మిదేళ్లలో మనీ లాండరింగ్ కేసుల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) 93.54 శాతం నేరాలను నిరూపించిందని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి సోమవారం లోక్‌సభకు లిఖితపూర్వకంగా తెలియజేశారు.
మనీ లాండరింగ్ నిరోధక చట్టం(పీఎంఎల్‌ఏ) కింద 31 కేసుల్లో దర్యాప్తు పూర్తి చేసిందని, ఇందులో 29 కేసుల్లో 54 మందిని దోషులుగా గుర్తించిందని వెల్లడించారు. పీఎంఎల్‌ఏ కింద నేర నిరూపణ రేటు 93.54 శాతం ఉందని పేర్కొన్నారు. అలాగే ఈడీ గత తొమ్మిదేళ్లలో రూ.16,507.86 కోట్ల విలువైన ఆస్తులను జప్తు చేసిందని తెలియజేశారు.
Comments
Please login to add a commentAdd a comment