conviction rate
-
మనీ లాండరింగ్ కేసుల్లో 93 శాతం నేర నిరూపణలు
న్యూఢిల్లీ: దేశంతో గత తొమ్మిదేళ్లలో మనీ లాండరింగ్ కేసుల్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) 93.54 శాతం నేరాలను నిరూపించిందని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి సోమవారం లోక్సభకు లిఖితపూర్వకంగా తెలియజేశారు. మనీ లాండరింగ్ నిరోధక చట్టం(పీఎంఎల్ఏ) కింద 31 కేసుల్లో దర్యాప్తు పూర్తి చేసిందని, ఇందులో 29 కేసుల్లో 54 మందిని దోషులుగా గుర్తించిందని వెల్లడించారు. పీఎంఎల్ఏ కింద నేర నిరూపణ రేటు 93.54 శాతం ఉందని పేర్కొన్నారు. అలాగే ఈడీ గత తొమ్మిదేళ్లలో రూ.16,507.86 కోట్ల విలువైన ఆస్తులను జప్తు చేసిందని తెలియజేశారు. -
100కు 95 కేసుల్లో నిర్దోషులుగా
అహ్మదాబాద్: ప్రధాని మోదీ సొంత రాష్ట్రమైన గుజరాత్లో దళితులపై అగ్రవర్ణాల దాడి కేసుల్లో నేర నిర్ధారణ అతి తక్కువగా ఉంది. ఇది దేశ జాతీయ సగటుకన్నా ఆరింతలు తక్కువగా ఉండటం గమనార్హం. ఇండియాస్పెండ్ సంస్థ విశ్లేషణ ప్రకారం ఇలాంటి ప్రతీ 100 కేసులకుగాను 95 కేసుల్లో నిందితులు నిర్దోషులుగా బయటపడుతున్నారు. తాజా గణాంకాల ప్రకారం ఎస్సీలపై జరిగిన కేసుల్లో నేర నిర్ధారణ శాతం జాతీయస్థాయిలో 28.8 శాతం ఉంటే, గుజరాత్లో కేవలం 3.4 శాతమే ఉంది. అలాగే ఎస్టీలపై దాడుల కేసుల్లో ఈ సగటు జాతీయంగా 37.9 శాతం ఉంటే, గుజరాత్లో 1.8 శాతమే ఉంది. కర్ణాటక, మహారాష్ట్రలో కూడా ఎస్సీ, ఎస్టీలపై దాడుల కేసుల్లో నేరనిర్ధారణ శాతం గుజరాత్తోపాటే ఉంది.