అహ్మదాబాద్: ప్రధాని మోదీ సొంత రాష్ట్రమైన గుజరాత్‌లో దళితులపై అగ్రవర్ణాల దాడి కేసుల్లో నేర నిర్ధారణ అతి తక్కువగా ఉంది. ఇది దేశ జాతీయ సగటుకన్నా ఆరింతలు తక్కువగా ఉండటం గమనార్హం. ఇండియాస్పెండ్ సంస్థ విశ్లేషణ ప్రకారం ఇలాంటి ప్రతీ 100 కేసులకుగాను 95 కేసుల్లో నిందితులు నిర్దోషులుగా బయటపడుతున్నారు.
తాజా గణాంకాల ప్రకారం ఎస్సీలపై జరిగిన కేసుల్లో నేర నిర్ధారణ శాతం జాతీయస్థాయిలో 28.8 శాతం ఉంటే, గుజరాత్‌లో కేవలం 3.4 శాతమే ఉంది. అలాగే ఎస్టీలపై దాడుల కేసుల్లో ఈ సగటు జాతీయంగా 37.9 శాతం ఉంటే, గుజరాత్‌లో 1.8 శాతమే ఉంది. కర్ణాటక, మహారాష్ట్రలో కూడా ఎస్సీ, ఎస్టీలపై దాడుల కేసుల్లో నేరనిర్ధారణ శాతం గుజరాత్‌తోపాటే ఉంది.
100కు 95 కేసుల్లో నిర్దోషులుగా
Published Sun, Jul 24 2016 11:43 AM | Last Updated on Mon, Sep 4 2017 6:04 AM
Advertisement