సాక్షి, హైదరాబాద్: సింగరేణి ఒక్క రాష్ట్ర ప్రభుత్వానిదే కాదని.. కేంద్రానికి బాధ్యత ఉందని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, సింగరేణిపై కేంద్రం పారదర్శకంగా వ్యవహరిస్తుందన్నారు. రాబోయే రోజుల్లో సింగరేణిని అన్ని విధాలా ఆదుకుంటామని తెలిపారు. డిప్యూటీ సీఎం చెప్పిన విషయాలన్నింటిని పరిశీలిస్తాం. ఒడిశాలో గనుల వ్యవహారంపై అక్కడి ముఖ్యమంత్రితో మాట్లాడతాను. దేశమంతా ఒకే పాలసీ వర్తించేలా చొరవ తీసుకుంటాం’’ అని కిషన్‌రెడ్డి వెల్లడించారు.
‘‘సింగరేణికి ఎటువంటి ఇబ్బంది ఉండదు. దీన్ని రాజకీయం చేయకూడదు. సింగరేణి కార్మికులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. సింగరేణిపై తప్పుడు ప్రచారాలు మానుకోవాలి. కోల్ ఇండియా లిమిటెడ్‌కు ఇచ్చిన ప్రాధాన్యత సింగరేణికి కేంద్రం ఇస్తోంది. రెండు మైన్లు కేంద్రం దృష్టిలో ఉన్నాయి.. ఒడిశా నైనీ ప్రాజెక్టుపై త్వరలో నిర్ణయం ఉంటుంది. సింగరేణిలో కొన్ని సమస్యలు ఉన్నాయి.. వాటిని అధిగమిస్తాం’’ అని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు.
‘‘రెండు, మూడు రోజుల్లో సింగరేణిపై మరింత స్పష్టత ఇస్తాం. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ నేతలు పొంతన లేకుండా వ్యాఖ్యలు చేస్తున్నారు. దేశ వ్యాప్తంగా ఉన్న పాలసీనే తెలంగాణలో అమలు అయ్యే అవకాశం. ఆక్షన్ అనేది ఓపెన్.. సింగరేణి మాత్రమే కాదు ఎవరైనా బిడ్డింగ్‌లో పాల్గొనవచ్చు‘‘ అని కిషన్‌రెడ్డి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment