న్యూఢిల్లీ: ప్రతి 15 రోజులకోసారి ఈశాన్య రాష్ట్రాలను సందర్శించాలంటూ ప్రధాని మోదీ తమను ఆదేశించారని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు చెప్పారు. అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా ఆయన లోక్‌సభలో మాట్లాడారు. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలి కేబినెట్ సమావేశంలో కేంద్ర మంత్రులతో మోదీ ఒక బృందాన్ని ఏర్పాటు చేశారని, ఇందులో ఐదుగురు కేబినెట్ మంత్రులు, ఏడుగురు సహాయ మంత్రులు ఉన్నారని తెలిపారు.
ప్రతి 15 రోజులకోసారి ఈశాన్యంలో పర్యటించాలంటూ ఈ బృందాన్ని ఆదేశించారని పేర్కొన్నారు. ప్రధాని ఆదేశాల ప్రకారం ఈశాన్యంలో పర్యటిస్తున్నట్లు వివరించారు. ఢిల్లీ నుంచి పాలించడం కాదు, నేరుగా ప్రజలకు వద్దకు వెళ్లాలని అధికారులను సైతం మోదీ ఆదేశించారని పేర్కొన్నారు.
కిరణ్ రిజిజు వ్యాఖ్యలపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరామ్ రమేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మణిపూర్‌లో గత 97 రోజుల్లో కేంద్ర మంత్రులు ఎవరెవరు ఎప్పుడు పర్యటించారో చెప్పాలని, దమ్ముంటే వివరాలు బయటపెట్టాలని రిజిజుకు సవాలు విసిరారు. ఈ మేరకు ట్వీట్ చేశారు.
During the No Confidence Motion in Lok Sabha, Union Minister Kiren Rijiju has boasted about the Prime Minister’s directions to Cabinet Ministers and Ministers of State to visit Northeast every 15 days.
— Jairam Ramesh (@Jairam_Ramesh) August 8, 2023
Yes, we all know about the frequency of visits of Union Ministers before any…
Comments
Please login to add a commentAdd a comment