Pawan Kalyan Family Send Diwali Gifts To Mahesh babu And Namrata Shirodkar: దీపావళి పండగ సందర్భంగా సినీ తారలంతా సెలబ్రెషన్స్‌లో మునిగిపోయారు. ఈ పండగను పురస్కరించుకుని కుటుంబ సభ్యులతో ఘనంగా సంబరాలు జరుపుకున్నారు. అల్లు, మెగా ఫ్యామిలీ ఒక్కచోట చేరి దీపావళి వేడుకలో పాల్గొన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో దీపావళి పర్వదినం సందర్భంగా నటుడు పవన్ కల్యాణ్ దంపతులు సూపర్ స్టార్ మహేశ్ బాబు దంపతులకు బాహుమతులు పంపారు. అలాగే డైరెక్టర్ క్రిష్‌కు కూడా పవన్ దీపావళి కానుకలు పంపినట్లు తెలుస్తోంది.
చదవండి: దీపావళి సర్‌ప్రైజ్: తనయులతో జూ. ఎన్టీఆర్, ఫొటో వైరల్
ఇక పవన్ దంపతులు పంపిన గిఫ్ట్ ఫొటోలను మహేశ్ భార్య నమ్రత శిరోద్కర్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ఈ బహుమతుల బాక్స్‌లో స్వీట్స్‌తో పాటు, పర్యావరణహిత పటాసులు ఉన్నాయి. ఈ సందర్భంగా పవన్, అన్నా లెజినోవా దంపతులు గిఫ్టులు పంపారంటూ నమ్రత ఫొటోను పంచుకున్నారు. ఈ మేరకు ‘థాంక్యూ అన్నా అండ్ పవన్. హ్యాపీ దివాలీ’ అంటూ ధన్యవాదాలు తెలిపారు. పరిశ్రమలో పవన్ కల్యాణ్, మహేశ్ బాబులు మంచి సన్నిహితులుగా ఉంటారనే విషయం తెలిసిందే. కాగా పవన్ కల్యాణ్ ప్రస్తుతం క్రిష్ డైరెక్షన్‌లో హరిహర వీరమల్లులో నటిస్తున్నారు. మహేశ్ ప్రస్తుతం సర్కారి వారి పాట మూవీ షూటింగ్‌తో బిజీగా ఉన్నాడు.
చదవండి:
దీపావళికి జిగేల్‌మన్న తారలు, చూసేయండి ఫొటోలు
Samantha: సమంత సంచలన నిర్ణయం, ఇకపై వాటికి దూరమట!
Comments
Please login to add a commentAdd a comment