
సాక్షి, ముంబై: ప్రభుత్వరంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ క్రిస్మస్, నూతన సంవత్సరం సందర్భంగా సరికొత్త ప్రయోజనాలను తన వినియోగదారులకు అందుబాటులోకి తీసుకొచ్చింది. రూ.1,999 విలువైన వార్షిక ప్లాన్‌లో అదనపు ప్రయోజనాలను అందించనుంది. ఈ ప్రీపెయిడ్ ప్లాన్‌లో వినియోగదారులు 60 రోజుల ఎక్స్‌ట్రా వాలిడిటీని పొందవచ్చని బీఎస్‌ఎన్‌ఎల్ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ ప్లాన్ వాలిడిటీ 365 రోజులు కాగా తాజా ఆఫర్ కింద 425 రోజుల వాలిడిటీని పొందవచ్చు. ఈ ఆఫర్ నేటి (జనవరి 25) నుంచి జనవరి 31వ తేదీ వరకు అందుబాటులో ఉంటుంది.
రూ.1,999 ప్లాన్
అన్‌లిమిటెడ్ కాల్స్, రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు, ఉచిత బీఎస్ఎన్ఎల్ ట్యూన్స్, టీవీ సబ్‌స్రిప్షన్, రోజుకు 3జీబీ డేటా లభ్యం. కాగా రిలయన్స్ జియో హ్యాపీ న్యూ ఇయర్ ప్లాన్ కింద రూ.2020తో వార్షిక ప్లాన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే.