భవానీపురం(విజయవాడపశ్చిమ): పర్యాటకుల మనస్సుదోచే తూర్పు గోదావరి జిల్లా పాపికొండల విహార యాత్రకు ఆంధ్రప్రదేశ్ పర్యాటక అభివృద్ధి శాఖ (ఏపీటీడీసీ) ప్రత్యేక ప్యాకేజీలను ప్రకటించింది. క్రిస్మస్, సంక్రాంతి పండుగల వేళ కుటుంబ సభ్యులతో కలిసి బోటులో విహరించేందుకు ఒకటి, రెండు రోజుల టూర్‌లను రాజమండ్రి, పోచవరం, గండి పోచమ్మ ప్రాంతాల నుంచి సిద్ధం చేసింది. ఆ ప్యాకేజీ వివరాలను ఏపీటీడీసీ కాకినాడ డివిజనల్ మేనేజర్ సీహెచ్ శ్రీనివాస్ శుక్రవారం మీడియాకు విడుదల చేశారు. రాజమండ్రి, గండి పోచమ్మ నుంచి పాపికొండలు వెళ్లే వారు సెల్ : 98486 29341, 98488 83091 నంబర్లలో, పోచవరం నుంచి పాపికొండలు వెళ్లే వారు సెల్ : 63037 69675 నంబర్లో సంప్రదించాలని కోరారు.
రాజమండ్రి నుంచి ఒక రోజు పర్యటన
రాజమండ్రి నుంచి పాపికొండలకు ఉదయం 7.30 గంటల నుంచి సాయంత్రం 7.30 గంటల వరకు పెద్దలు ఒక్కొక్కరికి రూ.1,250, చిన్నారులు ఒక్కొక్కరికి రూ.1,050 చార్జీగా నిర్ణయించారు. ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం శాఖాహార భోజనం, సాయంత్రం స్నాక్స్ ఇస్తారు.
రాజమండ్రి నుంచి 2 రోజుల పర్యటన
రాజమండ్రి నుంచి పాపికొండలకు ఉదయం 7.30 గంటలకు బయలుదేరి మరుసటి రోజు సాయంత్రం 7.30 గంటలకు తిరిగి వస్తారు. పెద్దలకు రూ.3,000, పిల్లలకు రూ.2,500 చార్జీ. మొదటి రోజు ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం శాఖాహార భోజనం, సాయంత్రం స్నాక్స్, రాత్రికి 2 నాన్‌వెజ్ కూరలతో భోజనం, 2వ రోజు ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం 2 నాన్‌వెజ్ కూరలతో భోజనం, సాయంత్రం స్నాక్స్.
పోచవరం నుంచి ఒక రోజు పర్యటన
పోచవరం నుంచి పాపికొండలకు ఉదయం 9.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు. పెద్దలకు రూ.950, పిల్లలకు రూ.750 చార్జీ. ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం శాఖాహార భోజనం, సాయంత్రం స్నాక్స్.
పోచవరం నుంచి 2 రోజుల పర్యటన
పోచవరం నుంచి పాపికొండలకు ఉదయం 7.30 గంటలకు బయలుదేరి తిరిగి మరుసటి రోజు సాయంత్రం 7.30 గంటల వరకు. పెద్దలకు రూ.2,500, పిల్లలకు రూ.2,000 చార్జీ. మొదటి రోజు ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం శాఖాహార భోజనం, సాయంత్రం స్నాక్స్, రాత్రికి 2 నాన్‌వెజ్ కూరలతో భోజనం, 2వ రోజు ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం రెండు నాన్‌వెజ్ కూరలతో భోజనం, సాయంత్రం అల్పాహారం.
గండి పోచమ్మ నుంచి ఒక రోజు పర్యటన
గండి పోచమ్మ నుంచి పాపికొండలకు ఉదయం 9.30 గంటలకు బయలుదేరి సాయంత్రం 5 గంటల వరకు. పెద్దలకు రూ.1,000, పిల్లలకు రూ.800 చార్జీ. ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం శాఖాహార భోజనం, సాయంత్రం స్నాక్స్.
గండి పోచమ్మ నుంచి 2 రోజుల పర్యటన
గండి పోచమ్మ నుంచి పాపికొండలకు ఉదయం 7.30 గంటలకు బయలుదేరి మరుసటి రోజు సాయంత్రం 7.30 గంటల వరకు. పెద్దలకు రూ.2,500, పిల్లలకు రూ.2,000 చార్జీ. మొదటి రోజు ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం శాఖాహార భోజనం, సాయంత్రం స్నాక్స్, రాత్రికి రెండు నాన్‌వెజ్ కూరలతో భోజనం. 2వ రోజు ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం రెండు నాన్‌వెజ్ కూరలతో భోజనం, సాయంత్రం అల్పాహారం.
‘పాపికొండల’ ప్రత్యేక ప్యాకేజీలు
Published Sat, Dec 17 2022 4:47 AM | Last Updated on Sat, Dec 17 2022 7:47 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment