రామ్ చరణ్‌పై ఉపాసన ప్రశంసలు.. పోస్ట్ వైరల్! | Upasana Shares Christmas Post With Daughter Klin Kaara And Ram Charan; Pic Viral - Sakshi
Sakshi News home page

Upasana: కూతురితో క్రిస్‌మస్‌ వేడుకల్లో చెర్రీ- ఉపాసన ట్వీట్ వైరల్!

Published Tue, Dec 26 2023 3:42 PM | Last Updated on Tue, Dec 26 2023 3:47 PM

Upasana Shares Christmas Post With Daughter klinkaara and ram charan - Sakshi

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం గేమ్ ఛేంజర్ చిత్రంలో నటిస్తున్నారు. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో బాలీవుడ్ భామ కియారా అద్వానీ చెర్రీకి జోడిగా కనిపించనుంది. అయితే ప్రస్తుతం షూటింగ్‌కు కాస్తా గ్యాప్ ఇచ్చిన రామ్ చరణ్ ఫ్యామిలీ ఫుల్ టైమ్ గడిపేస్తున్నారు. ఇటీవలే ముంబై వెళ్లిన చెర్రీ దంపతులు శ్రీ మహాలక్ష్మి ఆలయాన్ని సందర్శించారు. తొలిసారిగా తమ ముద్దుల కూతురు క్లీంకారతో కలిసి ఆలయంలో పూజలు నిర్వహించారు. అంతేకాకుండా మహారాష్ట్ర సీఎంను కలిసి రామ్ చరణ్‌ దంపతులు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.

(ఇది చదవండి: మనోజ్‌-మౌనికల కొత్త వ్యాపారం.. నాలుగున్నరేళ్లుగా సీక్రెట్‌గా..)

అయితే ప్రస్తుతం సినీతారలంతా క్రిస్‌మస్‌ ఫెస్టివల్ మూడ్‌లో ఉన్నారు. ఇప్పటికే మెగా కుటుంబసభ్యులంతా కలిసి ఈ పండుగను సెలబ్రేట్ చేసుకున్నారు. ఉపాసన- రామ్ చరణ్ సైతం తమ గారాలపట్టి క్లీంకారతో కలిసి వేడుకల్లో పాల్గొన్నారు. దీనికి సంబంధించిన ఫోటోలను ఆమె సోషల్ మీడియాలో షేర్ చేశారు. కుటుంబంతో కలిసి పండుగ జరుపకోవడం ఆనందంగా ఉందని అన్నారు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement