
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతులు తొలిసారి బిడ్డతో కలిసి ఆలయాన్ని సందర్శించారు. తమ ముద్దుల కూతురు క్లీంకారతో కలిసి ముంబైలోని శ్రీ మహాలక్ష్మి ఆలయానికి వెళ్లారు. తమ కుమార్తె క్లీంకారతో కలిసి అమ్మవారి ఆశీస్సులు అందుకున్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
(ఇది చదవండి: పరారీలో రైతుబిడ్డ.. బిగ్ ట్విస్ట్ ఇచ్చిన పల్లవి ప్రశాంత్!)
ఈ సందర్భంగా ఆలయ సిబ్బంది మెగా దంపతులకు ఆహ్వానం పలికారు. అనంతరం అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా రామ్‌చరణ్‌తో సెల్ఫీలు తీసుకునేందుకు ఫ్యాన్స్ ఆసక్తి చూపించారు. కాగా.. ప్రస్తుతం రామ్ చరణ్, శంకర్ కాంబినేషన్‌లో గేమ్ ఛేంజర్ చిత్రం తెరకెక్కుతోంది. ఈ చిత్రం వచ్చే ఏడాదిలో రిలీజ్ అయ్యే అవకాశం ఉంది.
(ఇది చదవండి: బిగ్‌బాస్ రన్నరప్ గొప్పమనసు.. కుటుంబంతో కలిసి ఏం చేశాడంటే?)