Microsoft Launches A Minesweeper Inspired Christmas Special Sweater: మైక్రోసాఫ్ట్ అంటే తెలియని వారు ఎవరు ఉండరు అనుకుంటా బహుశా..! టెక్ దిగ్గజం ఐటీ ఆధారిత సేవలకు పెట్టింది పేరు. ప్రపంచవ్యాప్తంగా క్లౌడ్ బేస్‌డ్, విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్స్ సర్వీసులను మైక్రోసాఫ్ట్ అందిస్తోంది. వీటితో పాటుగా ప్రతి క్రిస్మస్‌కు మైక్రోసాఫ్ట్ వెరైటీ స్వెటర్‌ను లాంచ్ చేస్తోంది. ఈ ఏడాది కూడా క్రిస్మస్‌కు ‘ మైన్‌స్వీపర్ ఆగ్లీ’ అనే పేరుతో స్వెటర్‌ను విడుదల చేసింది.
ఈ స్వెటర్ ప్రత్యేకత ఏమిటంటే..!
మైక్రోసాఫ్ట్ 1990 నుంచి ప్రతి ఏడాది క్రిస్టమస్‌కు ఓ వినూత్న స్వెటర్‌ను లాంచ్ చేస్తుంది. వీటి సేల్స్ ద్వారా వచ్చే ఆదాయాన్ని స్వచ్ఛంద సంస్థలకు అందజేస్తుంది. గత ఏడాది ఎంఎస్ పెయింట్- ఆధారిత ‘అగ్లీ క్రిస్మస్ స్వెటర్‌ను లాంచ్ చేయగా...వాటి నుంచి వచ్చిన ఆదాయాన్ని మైక్రోసాఫ్ట్ గర్ల్స్ హూ కోడ్ ఫౌండేషన్‌కు విరాళంగా ఇచ్చింది. కంప్యూటర్ సైన్స్ విద్యను అభ్యసిస్తున్న యువతులకు గర్ట్స్ హూ కోడ్ ఫౌండేషన్ సహాయం చేసింది.
ధర ఎంతంటే..!
మైన్స్‌స్వీపర్ గేమ్ స్ఫూర్తిలో ఈ స్వెటర్‌ను మైక్రోసాఫ్ట్ రూపొందించింది. అమెరికన్ మార్కెట్లలో ఈ మైన్స్‌స్వీపర్ అగ్లీ స్వెటర్ ధర 74.99 డాలర్లు (సుమారు రూ. 5,600)గా ఉంది. ఈ స్వెటర్‌ను ప్రపంచవ్యాప్తంగా షిప్పింగ్ చేయనుంది. అన్ని దేశాలవారు ఈ స్వెటర్‌ను కొనుగోలుచేయవచ్చును. స్మాల్, లార్జ్, మీడియమ్, ఎక్స్‌ఎల్, డబుల్‌ఎక్స్‌ఎల్, త్రిబుల్ ఎక్సెఎల్ సైజులో లభించనుంది.
చదవండి: బీఎస్‌ఎన్‌ఎల్ యూజర్లకు అదిరిపోయే శుభవార్త..!
Comments
Please login to add a commentAdd a comment