మహిళల సంబంధ వస్తువులకు సంబంధించిన ప్రకటనను ట్రాన్స్‌జెండర్‌తో రూపొందించాలన్న టెక్ దిగ్గజం గూగుల్ ‘వినూత్న’ ఐడియా బెడిసికొట్టింది. దానిపై మహిళాలోకంలో ఆగ్రహావేశాలు పెల్లుబికాయి. క్రిస్మస్ వేళ ఇలాంటి యాడ్ ఎందుకు తెచ్చారంటూ దుమ్మెత్తిపోశారు. అందమైన మహిళలే లేనట్టు ట్రాన్స్‌జెండర్‌తో యాడ్ చేస్తారా అంటూ నెటిజన్లు కూడా గూగుల్‌పై మండిపడుతున్నారు.
క్రిస్మస్ సందర్భంగా గూగుల్ తన సొంత షాపింగ్ వేదిక ‘గూగుల్ షాపింగ్’లో మహిళల ఉత్పత్తులను ప్రమోషన్‌కు ఒక యాడ్ సిద్ధం చేసింది. టిక్‌టాక్‌లో పేరొందిన సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్, కంటెంట్ క్రియేటర్ 30 ఏళ్ల సైరస్ వెస్సీని ప్రచారకర్తగా ఎంచుకుంది. చంపేసే చలిలో అత్యంత నాణ్యమైన మేకప్, చర్మ సంబంధ ఉపకరణాలు, దుస్తులను తక్కువ ధరకే కొనుక్కోండంటూ వెస్సీతో ఒక యాడ్ డిజైన్ చేసి ఆన్‌లైన్ ప్రసారాలు మొదలెట్టారు.
కానీ అందులో ట్రాన్స్‌జెండర్ నటించడంతో ఆదరణ దేవుడెరుగు, విమర్శలు వెల్లువెత్తాయి. ‘‘ఇది దారుణమైన అజెండాతో రూపొందించిన యాడ్. అమ్మాయిలను అవమానించాలని చేసినట్టుగా ఉంది’’ అంటూ పలు ప్లాస్టిక్ సర్జరీలు చేయించుకున్న బ్రిటన్‌కు చెందిన ప్రముఖ వ్యాఖ్యాత ఓలీ లండన్ అన్నారు. దాంతో, మహిళలను కించపరచాలనే దురుద్దేశమేదీ లేదంటూ గూగుల్ వివరణ ఇచి్చంది. సోషల్ మీడియాలో పేరొందిన ‘విభిన్న’ వ్యక్తులతో యాడ్ చేద్దామనే ఉద్దేశంతోనే అలా రూపొందించినట్టు చెప్పుకొచ్చింది.
– వాషింగ్టన్
Comments
Please login to add a commentAdd a comment