
శాన్‌ప్రాన్సిస్కో: శాస్త్రీయంగా నిర్థారణ కాని వైద్య చికిత్సలకు సంబంధించిన ప్రకటనలపై నిషేధం విధిస్తున్నట్లు సెర్చ్ ఇంజన్ దిగ్గజం గూగుల్ శుక్రవారం ప్రకటించింది. స్టెమ్ సెల్ థెరపీ, సెల్యూలార్ థెరపీ, జీన్ థెరపీల వంటి శాస్త్రీయంగా పూర్తిగా నిర్ధారణకాని ప్రయోగాత్మక వైద్య విధానాలకు సంబంధించిన యాడ్‌లు ఇకపై గూగుల్‌లో కనుమరుగు కానున్నాయని గూగుల్ పాలసీ సలహాదారు ఆడ్రిన్నె బిడ్డింగ్స్ తెలిపారు. బయో మెడికల్, సైంటిఫిక్ ఆధారాలు లేని అన్ని వైద్యవిధానాలు, థెరపీ ప్రకటనల నియంత్రణ కోసం కొత్త పాలసీ తీసుకొచ్చినట్లు ఆమె చెప్పారు.
రోగాలతో బాధపడుతున్న వారు ఈ తరహా యాడ్స్ కారణంగా తప్పుదోవ పడుతున్నారని గూగుల్ పేర్కొంది. ఇది మెడికల్ పరిశోధనలను తప్పుబట్టడం కాదని, నిర్థారణ కానటువంటి వాటిపై ఓ కన్నేసి ఉంచడం మాత్రమే అని స్పష్టం చేసింది. దీన్ని ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ స్టెమ్ సెల్ రీసెర్చ్ అధ్యక్షుడు దీపక్ శ్రీవత్సవ స్వాగతించారు. సంపూర్ణ చికిత్సా విధానాలుగా అభివృద్ధిగాని ఇలాంటి చికిత్సలు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడతాయని అభిప్రాయపడ్డారు. ఇలాంటివి ప్రజల నమ్మకాన్ని దెబ్బతీస్తాయన్నారు. ఇలాంటి సందేశాలను నియంత్రించడంలో ఆన్‌లైన్ సర్వీసులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment