క్రిస్మస్ రోజుల్లో పచ్చని జీవితానికి ప్రతీకగా పచ్చని చెట్టును ఇళ్లల్లో అలంకరించుకుంటారు. ఆ చెట్టుకు మనలోని ఆశలకు ప్రతిరూపాలుగా అందమైన బాల్స్, చిరుగంటలు, లైట్లతో అలంకరించడం చూస్తుంటాం. క్రిస్మస్ చెట్టుతో పాటు ఇంటి బాల్కనీలో, డైనింగ్–లివింగ్ రూమ్‌లలో అలంకరణకు ఉపయోగించే అందమైన బాల్స్ తయారీలో ఎన్నో డిజైన్లు కనువిందు చేస్తున్నాయి.
ఆర్నమెంట్ స్పాంజ్ బాల్స్
ఎన్ని బాల్స్ కావాలో ముందే ఎంపిక చేసుకోవచ్చు. రకరకాల సైజుల్లో ఇవి మార్కెట్లో లభిస్తుంటాయి. ఈ బాల్స్‌ని పెయింట్ చేసి అలంకరించవచ్చు. మగ్గం వర్క్‌కి ఉపయోగించే బీడ్స్, లేస్, స్వరోస్కి వంటి పూసలను గమ్ సాయంతో అతికించి అందంగా తీర్చిదిద్దుకోవచ్చు. గట్టి దారంతో లేదా రంగు రిబ్బన్‌తో వేలాడదీయచ్చు.
క్యాండీబాల్స్
పలు పరిమాణాల్లో ట్రాన్స్‌పరెంట్ ప్లాస్టిక్ బాల్స్ దొరుకుతాయి. వీటిలో చిన్న చిన్న చాక్లెట్లు, క్యాండీలను నింపి వేలాడదీయొచ్చు. ఇవి పిల్లలను మరింతగా ఆకర్షిస్తాయి. పండగ సంబరాన్ని వారిలో రెట్టింపు చేస్తాయి.
హెన్నా డిజైన్ బాల్స్
చేతులపై కోన్స్‌తో వేసే హెన్నా డిజైన్స్ గురించి మనందరికీ తెలిసిందే. ఆ డిజైన్స్‌ను పెయింట్‌తో ఈ బాల్స్‌పై వేసి మరింత అందంగా తయారుచేసుకోవచ్చు. నచ్చే డిజైన్ ఎవరికి వారు ఎంపిక చేసుకోవచ్చు. వీటి కాంబినేషన్‌కి కొన్ని పూసలు, దారాలు, రంగు రంగు రిబ్బన్లను కూడా జత చేసుకోవచ్చు.
కుందన్–మిర్రర్ బాల్స్
రాత్రివేళ మరింతగా మెరుపులీనుతూ వేలాడదీసిన బాల్స్ కనువిందు చేస్తుంటే మనసు మరింత ఉల్లాసభరితంగా ఉంటుంది. అందుకని అందమైన బాల్స్ తయారీలో కుందన్స్, మిర్రర్ గ్లూ సాయంతో అతికించి తయారుచేసుకోవచ్చు. క్రిస్మస్ వచ్చేటప్పుడు ప్రేమాభిమానాలను, సుఖసంతోషాలను తీసుకురావాలని ఆహ్వానం పలికే ఈ ప్రక్రియ ఇంటిని కళాభరితంగా మార్చేస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment