
చిన్నచిన్న పాత్రల చేస్తూ గుర్తింపు తెచ్చుకున్న విజయ్ సేతుపతి ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. విలక్షణ నటుడిగా ఎవరూ ఊహించని స్థాయికి చేరుకున్నాడు. ప్రస్తుతం అర్థ సెంచరీ సినిమాల మార్క్ దాటేసిన విజయ్.. అన్ని భాషల్లోనూ నటిస్తూ ఫుల్ బిజీగా ఉన్నాడు. తాజాగా తన కొత్త మూవీని సంక్రాంతి బరిలో పెట్టాడు.
(ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీల్లోకి ఏకంగా 33 సినిమాలు)
విజయ్ సేతుపతి, కత్రినా కైఫ్ జంటగా నటించిన మూవీ 'మేరీ క్రిస్మస్'. రాధికా శరత్‌కుమార్, సంజయ్‌కపూర్, టీనూ ఆనంద్, రాధిక ఆప్టే తదితరులు కీలకపాత్రలు పోషించారు. 'అంధాదున్' ఫేమ్ శ్రీరామ్ రాఘవన్ దర్శకత్వం వహించారు. ఇప్పుడీ చిత్రాన్ని 2024 జనవరి 12న అంటే సంక్రాంతికి రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించారు.
ఇప్పటికే పొంగల్ బరిలో రజనీకాంత్ లాల్‌సలామ్, ధనుష్ కెప్టెన్ మిల్లర్, శివకార్తికేయన్ అయలాన్, సుందర్.సి 'అరణ్మణై 4' రెడీగా ఉన్నాయి. అలానే తెలుగులో గుంటూరు కారం, హనుమాన్, సైంధవ్, ఫ్యామిలీస్టార్, నా సామిరంగ, రవితేజ 'ఈగల్' కూడా సంక్రాంతి బరిలోనే ఉండటం విశేషం. అయితే విజయ్ క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేసిన సినిమాలు హిట్, బ్లాక్ బస్టర్స్ అవుతున్నాయి గానీ హీరోగా చేసిన మూవీస్ మాత్రం బాక్సాఫీస్ దగ్గర ఢమాల్ అవుతున్నాయి. మరి 'మేరీ క్రిస్మస్' ఏం చేస్తుందో చూడాలి.
(ఇదీ చదవండి: ఫౌల్ గేమ్ ఆడి దొరికిపోయిన శివాజీ.. మళ్లీ శోభాశెట్టితో పనికిరాని గొడవ!)
Comments
Please login to add a commentAdd a comment