బాలీవుడ్ అందగాడు, సూపర్ హీరో హృతిక్ రోషన్ బుధవారం (జనవరి 10న) 50వ పడిలోకి అడుగుపెట్టారు. ప్రేమకథ, యాక్షన్, ఫ్యామిలీ ఎంటర్‌టైనింగ్, ఫిక్షనల్.. ఇలా అన్ని రకాల సినిమాల్లో నటించి అన్ని వయసులవారి మనసులు గెలుచుకున్నాడు. ఇకపోతే హృతిక్ రోషన్ పుట్టినరోజు పురస్కరించుకుని ఆయన అభిమానులు రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడులోనూ తమ అభిమాన హీరో బర్త్‌డేను గ్రాండ్‌గా సెలబ్రేట్ చేశారు.
ఈ కార్యక్రమంలో భాగంగా అభిమానులు హైదరాబాద్, విజయవాడ, వైజాగ్ లో ఉన్న కొన్ని అనాథాశ్రమాల్లో అన్నదానం చేశారు. అలాగే మంగళగిరి, వైజాగ్‌లో మొక్కలు నాటారు. చెన్నై, హైదరాబాద్, విజయవాడ నగరాల్లో కేక్ కటింగ్ ద్వారా సెలబ్రేషన్స్ జరుపుకున్నారు. చెన్నై సిటీలో ట్రక్కులో ఫుడ్ పంపిణీ చేశారు. అలాగే కొంతమంది ఫ్యాన్స్ హృతిక్ రోషన్ హిట్ సాంగ్స్‌కు డ్యాన్స్ చేశారు. తమ అభిమాన హీరో సినిమా ఫైటర్ జనవరి 25న విడుదల అవుతున్న సందర్బంగా ఈ మూవీ పెద్ద సక్సెస్ అవ్వాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.
చదవండి: నత్తోడు అని హేళన..బురదనీళ్లతోనే స్నానం..హృతిక్ పడ్డ కష్టాలెన్నో..
Comments
Please login to add a commentAdd a comment