సాయం చేసే చేతులే మిన్న | tholi kiranam film Platinum Disc was held in Hyderabad. | Sakshi
Sakshi News home page

సాయం చేసే చేతులే మిన్న

Published Sat, Jul 15 2017 12:36 AM | Last Updated on Tue, Sep 5 2017 4:02 PM

సాయం చేసే చేతులే  మిన్న

సాయం చేసే చేతులే మిన్న

జె. జాన్‌ బాబు దర్శకత్వంలో పీవీ రాజు, అభినయ, జె.జె ప్రకాష్‌ రావు ముఖ్య తారలుగా రూపొందిన చిత్రం ‘తొలి కిరణం’. సువర ్ణ క్రియేషన్స్‌ పతాకంపై టి.సుధాకర్‌బాబు నిర్మించారు. ఆర్పీ పట్నాయక్‌ సంగీత దర్శకుడు. యాభై లక్షలకుపైగా ఈ సినిమా సీడీలు అమ్ముడుపోయిన సందర్భంగా ఈ చిత్రం ప్లాటినమ్‌ డిస్క్‌ వేడుకను హైదరాబాద్‌లో జరిపింది.

జాన్‌ బాబు తల్లి విజయమ్మ 77వ జయంతిని పురస్కరించుకుని వందమంది పేదలకు దుస్తులు, గృహోపకరణాలు పంపిణీ చేశారు. ముఖ్య అతిథి శివాజీరాజా మాట్లాడుతూ- ‘‘ప్రార్థించే చేతుల కన్నా, సాయం చేసే చేతులు మిన్న’ అని అన్నారు. ఈ చిత్రకథ అనుకున్నప్పుడే నటీనటులను ఎన్నుకున్నాను. సినిమా అవుట్‌పుట్‌ చుశాక నా నమ్మకం వమ్ము కాలేదనిపించింది’ అన్నారు జాన్‌ బాబు. ‘కంటెంట్‌కు ప్రాధాన్యత ఇచ్చి, బడ్జెట్‌కు కాంప్రమైజ్‌ కాకుండా నిర్మించాం’’  అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement