tholi kiranam
-
యేసు మహిమలు
పి.డి. రాజు యేసుక్రీస్తుగా నటించిన సినిమా ‘తొలి కిరణం’. జాన్ బాబు దర్శకత్వంలో సువర్ణ క్రియేషన్స్ పతాకంపై టి. సుధాకర్ నిర్మించిన ఈ చిత్రం సెన్సార్ పనులు పూర్తయ్యాయి. జాన్ బాబు మాట్లాడుతూ – ‘‘జీసస్ జీవితంలో ఇప్పటివరకూ చూపించని కథతో ఈ చిత్రాన్ని రూపొందించాం. సుమారు 5 కోట్లతో ఎక్కడా రాజీ పడకుండా తీశాం. తొలి కాపీ చూశా. అద్భుతంగా వచ్చింది. క్రీస్తు పాత్రలో పి.డి. రాజు జీవించాడు. శిలువ వేసే సన్నివేశాలు చిత్రీకరించడానికి ముందు 40 రోజులు ఉపవాస దీక్ష చేశాడు. ఓ రోజు చర్చిలో ప్రార్థన చేస్తుంటే అతనికి ప్రభువు కనిపించాడు. అన్ని మతాలు, అన్ని వర్గాల వారు చూసేలా సినిమా ఉంటుంది. ప్రభువు మహిమలను ప్రతి ఒక్కరూ చూసి తరిస్తారని ఆశిస్తున్నాం. ఆర్పీ పట్నాయక్ స్వరపరిచిన పాటలకు మంచి స్పందన లభిస్తోంది. డిసెంబర్ 8న సినిమా విడుదలకు సన్నాహాలు చేస్తున్నాం.’’ అన్నారు. -
సాయం చేసే చేతులే మిన్న
జె. జాన్ బాబు దర్శకత్వంలో పీవీ రాజు, అభినయ, జె.జె ప్రకాష్ రావు ముఖ్య తారలుగా రూపొందిన చిత్రం ‘తొలి కిరణం’. సువర ్ణ క్రియేషన్స్ పతాకంపై టి.సుధాకర్‌బాబు నిర్మించారు. ఆర్పీ పట్నాయక్ సంగీత దర్శకుడు. యాభై లక్షలకుపైగా ఈ సినిమా సీడీలు అమ్ముడుపోయిన సందర్భంగా ఈ చిత్రం ప్లాటినమ్ డిస్క్ వేడుకను హైదరాబాద్‌లో జరిపింది. జాన్ బాబు తల్లి విజయమ్మ 77వ జయంతిని పురస్కరించుకుని వందమంది పేదలకు దుస్తులు, గృహోపకరణాలు పంపిణీ చేశారు. ముఖ్య అతిథి శివాజీరాజా మాట్లాడుతూ- ‘‘ప్రార్థించే చేతుల కన్నా, సాయం చేసే చేతులు మిన్న’ అని అన్నారు. ఈ చిత్రకథ అనుకున్నప్పుడే నటీనటులను ఎన్నుకున్నాను. సినిమా అవుట్‌పుట్ చుశాక నా నమ్మకం వమ్ము కాలేదనిపించింది’ అన్నారు జాన్ బాబు. ‘కంటెంట్‌కు ప్రాధాన్యత ఇచ్చి, బడ్జెట్‌కు కాంప్రమైజ్ కాకుండా నిర్మించాం’’ అన్నారు. -
యేసు సందేశంతో...
ఏసుక్రీస్తు సమాధి నుంచి తిరిగొచ్చిన తర్వాత నలభై రోజులు భూమ్మీద తిరిగారు. అప్పుడేం చేశారు? ఏం సందేశం అందించారు? అనే కథాంశంతో రూపొందు తోన్న చిత్రం ‘తొలి కిరణం’. పీడీ రాజు ఏసుక్రీస్తుగా, అభినయ మేరీ మాతగా జాన్‌బాబు దర్శకత్వంలో టి.సుధాకర్ నిర్మిస్తున్నారు. ఆగస్టు 28న పాటల్ని, క్రిస్మస్కి చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారు. ‘‘ఇప్పటివరకూ క్రీస్తు జీవితంలో ఎవరూ స్పృశించని అంశాలతో ఈ చిత్రం ఉంటుంది. తెలంగాణ సీఎం కేసీఆర్ సమక్షంలో పాటల్ని విడుదల చేయను న్నాం. ఆర్పీ పట్నా యక్ స్వరాలు, చంద్రబోస్ సాహిత్యం హైలైట్’’ నిర్మాత అన్నారు. -
క్రీస్తు సందేశం
యేసు ప్రభువు మరణించిన తర్వాత మూడో రోజు సమాధి నుంచి తిరిగొచ్చి 40 రోజుల పాటు భూమ్మీద తిరిగారు. ఆ 40 రోజుల పాటు ఏం చేశారు? ఎవరెవర్ని కలిశారు? అనే కథతో రూపొందుతున్న చిత్రం ‘తొలి కిరణం’. జాన్‌బాబు దర్శకత్వంలో పీడీ రాజు, అభినయ, బాలచందర్ ముఖ్యపాత్రల్లో సుధాకర్ నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది. దర్శకుడు మాట్లాడుతూ- ‘‘మానవాళికి క్రీస్తు అందించిన సందేశాన్ని ఈ చిత్రంలో చూపించను న్నాం. త్వరలో పాటలను, మార్చి 25న గుడ్ ఫ్రైడేకి చిత్రాన్ని రిలీజ్ చేయనున్నాం. నిర్మాత అందిస్తున్న సహకారం మరువలేనిది’’ అని చెప్పారు. ఈ చిత్రానికి సహ నిర్మాత: బి.ఎస్.రెడ్డి. -
క్రీస్తు విశేషాలతో...
ఏసుక్రీస్తు జీవిత విశేషాల నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం ‘తొలి కి రణం’. పీడీ రాజు ముఖ్య పాత్రలో నటించిన ఈ చిత్రానికి కె.జాన్‌బాబు దర్శకుడు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ శరవేగంగా సాగుతోంది. దర్శకుడు మట్లాడుతూ -‘‘గోవా, ఈజిప్ట్, పాలస్తీనా, ఇజ్రాయిల్‌లో జరిపే చిత్రీకరణతో ఈ సినిమా షూటింగ్ పూర్తవుతుంది. మార్చి 25న గుడ్‌ఫ్రైడే సందర్భంగా ఈ చిత్రాన్ని విడుదల చేస్తాం’’ అని తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: ఆర్.పి.పట్నాయక్, కథ-మాటలు: టి.ప్రభుకిరణ్, కథా సహకారం: వి.ఎమ్.ఎమ్.ప్రవీణ్, ఛాయాగ్రహణం: మురళీకృష్ణ.