యేసు మహిమలు | Tholi Kiranam film was released on December 8th | Sakshi
Sakshi News home page

యేసు మహిమలు

Published Thu, Sep 7 2017 12:45 AM | Last Updated on Sun, Sep 17 2017 6:29 PM

యేసు మహిమలు

యేసు మహిమలు

పి.డి. రాజు యేసుక్రీస్తుగా నటించిన సినిమా ‘తొలి కిరణం’. జాన్‌ బాబు దర్శకత్వంలో సువర్ణ క్రియేషన్స్‌ పతాకంపై టి. సుధాకర్‌ నిర్మించిన ఈ చిత్రం సెన్సార్‌ పనులు పూర్తయ్యాయి. జాన్‌ బాబు మాట్లాడుతూ – ‘‘జీసస్‌ జీవితంలో ఇప్పటివరకూ చూపించని కథతో ఈ చిత్రాన్ని రూపొందించాం. సుమారు 5 కోట్లతో ఎక్కడా రాజీ పడకుండా తీశాం. తొలి కాపీ చూశా. అద్భుతంగా వచ్చింది. క్రీస్తు పాత్రలో పి.డి. రాజు జీవించాడు.

శిలువ వేసే సన్నివేశాలు చిత్రీకరించడానికి ముందు 40 రోజులు ఉపవాస దీక్ష చేశాడు. ఓ రోజు చర్చిలో ప్రార్థన చేస్తుంటే అతనికి ప్రభువు కనిపించాడు. అన్ని మతాలు, అన్ని వర్గాల వారు చూసేలా సినిమా ఉంటుంది. ప్రభువు మహిమలను ప్రతి ఒక్కరూ చూసి తరిస్తారని ఆశిస్తున్నాం. ఆర్పీ పట్నాయక్‌ స్వరపరిచిన పాటలకు  మంచి స్పందన లభిస్తోంది. డిసెంబర్‌ 8న సినిమా విడుదలకు సన్నాహాలు చేస్తున్నాం.’’ అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement