
నందిత పాత్రలో అభినయ
శంభో శివ శంభో చిత్రంలో శివ బాలాజీ ప్రియురాలిగా ... సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రంలో వెంకటేశ్, మహేశ్ బాబు సోదరిగా ఇప్పటికే తన అందం... అభినయంతో ప్రేక్షక మనసులు దోచుకున్న నటి అభినయ. తాజాగా తుడి పేరుతో తెరకెక్కుతున్న చిత్రంలో ఆమె నటించనుంది. అందుకు అంగీకార పత్రంపై కూడా ఆమె సంతకం చేసింది.
కామెడీ థ్రీల్లర్ కథాంశంతో రూపొందుతున్న ఈ చిత్రంలో అభినయా నందినిగా హోటల్ యజమాని పాత్రలో ఒదిగిపోనుంది. ఈ చిత్రానికి రితున్ సాగర్ దర్శకత్వం వహిస్తున్నారు. హీరో ధనుష్ నటించి తాజా హిందీ చిత్రం షమితాబ్లో కూడా అభినయా నటించిన సంగతి తెలిసిందే.