ప్రేమలో పడితే... అంతేనా? | News of Premalo Padithe 100% Breakup movie | Sakshi
Sakshi News home page

ప్రేమలో పడితే... అంతేనా?

Published Fri, Mar 10 2017 11:26 PM | Last Updated on Tue, Sep 5 2017 5:44 AM

ప్రేమలో పడితే... అంతేనా?

ప్రేమలో పడితే... అంతేనా?

ప్రతి ప్రేమకథలోనూ హ్యాపీ ఎండింగ్‌ ఉండదు. అలాగని ప్రేమికులందరూ చివరకు బ్రేకప్‌ అవుతారనీ చెప్పలేం. కానీ, ఓ తమిళ హీరో మాత్రం ప్రేమలో పడితే కచ్చితంగా బ్రేకప్‌ తప్పదంటున్నారు.

ఎజిల్‌ దురై హీరోగా నటిస్తూ, దర్శకత్వం వహించిన తమిళ సినిమా ‘సెంజిత్తలే ఎన్‌ కాదలా’. మధుమిల, అభినయ హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రాన్ని ‘ప్రేమలో పడితే 100% బ్రేకప్‌’ పేరుతో ఎస్‌. బాలసుబ్రమణ్యన్, ఎస్‌. ప్రభాకర్‌ తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. లవ్‌ అండ్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ చిత్రాన్ని ఈ నెలలోనే తెలుగు, తమిళ భాషల్లో విడుదల చేయాలను కుంటున్నామని నిర్మాతలు తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: రాజ్‌భరత్‌.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement