
Abhinaya Sri In Bigg Boss 6 Telugu: 'స్నేహమంటే ఇదేరా' సినిమాతో టాలీవుడ్‌కు పరిచయం అయిన నటి అభినయశ్రీ. అల్లు అర్జున్ హీరోగా నటించిన ఆర్య సినిమాలో అ అంటే అమలాపురం.. పాటతో మంచి క్రేజ్‌ను సంపాదించుకుంది. ఆ తర్వాత శ్వేత నాగు, అత్తిలి సత్తిబాబు, మైఖేల్ మదన కామరాజు వంటి పలు సినిమాల్లో నటించింది. తెలుగులోనే కాకుండా తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో కూడా నటించింది. తమిళ టెలివిజన్ షోలో జూనియర్ సూపర్ డాన్స్, డాన్స్ జోడి డాన్స్, వంటి పలు షోలకు హోస్ట్‌గానూ అలరించింది. 2014లో పాండవులు సినిమాలో చివరిసారిగా నటించింది.
ఇక దాదాపు 9ఏళ్ల పాటు తెలుగు తెరకు దూరంగా ఉన్న అభినయ శ్రీ బిగ్‌బాస్-6తో రీఎంట్రీ ఇస్తున్నారు. జంతు ప్రేమికురాలైన అభినయ శ్రీకి బల్లి అంటే మాత్రం చచ్చేంత భయమట. దీంతో పులి అంటే భయం లేదు కానీ లిజర్డ్(బల్లి)అంటే భయమా అని నాగార్జున అడిగారు. చిన్నప్పటి నుంచి తనకి బల్లులంటే భయమని చెబుతుండగానే ఒక్కసారిగా పై నుంచి ప్లాస్టిక్ బల్లులు పడ్డాయి. మరి బిగ్‌బాస్ షోతో వచ్చిన క్రేజ్‌తో సినిమాల్లో మళ్లీ కంబ్యాక్ ఇవ్వనుందా అన్నది చూడాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment