దేవుడు అన్నీ ఇచ్చినా ఇంకా ఏదో తక్కువైందని కొందరు భగవంతుడిని నిందిస్తూ ఉంటారు. జీవితంలో సక్సెస్ అయితే తమ కష్టం వల్లే అది సాధ్యమైందని, లేదంటే ఎవరి కన్ను తమపై పడిందోనని తిట్టిపోస్తుంటారు. ఇలాంటివారు మన చుట్టూ బోలెడంతమంది కనిపిస్తూ ఉంటారు. అయితే ఏదో ఒక లోపంతో పుట్టినవారు అలా తిట్టుకుంటూ కాలక్షేపం చేయడానికి బదులు జీవిత పోరాటం చేస్తారు. కష్టాలను అధిగమిస్తూ ముందుకు సాగుతుంటారు. తమకంటూ ఓ ప్రత్యేకతను సృష్టించుకుంటారు. అలాంటివారిలో ఒకరే హీరోయిన్ అభినయ.
మాట్లాడలేదు, కానీ..
పేరుకు తగ్గట్లుగానే అభినయంలో ఆమెకు వంక పెట్టడానికి లేదు. కానీ పుట్టుకతోనే ఆమె చెవిటి, మూగ. దానికి తోడు ప్రోటీన్స్ లోపం వల్ల మూడేళ్ల వరకు లేచి నడవలేకపోయింది. అయినా ఆమె కుంగిపోలేదు. తన మైనస్‌లనే ప్లస్‌గా మార్చుకుంది. మాట్లాడలేకపోయినా, ఏమీ వినబడకపోయినా ఎదుటివారి పెదాల కదలికను బట్టి వారు ఏం మాట్లాడుతున్నారో ఇట్టే పసిగట్టేస్తుంది. పాత్రలకనుగుణంగా హావభావాలను వ్యక్తీకరించగలుగుతుంది.
రిజెక్ట్ చేసిన డైరెక్టర్
'నేనింతే' సినిమాతో వెండితెరపై రంగప్రవేశం చేసింది అభినయ. టాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్, హిందీలో బోలెడన్ని సినిమాలు చేసింది. అయితే కోలీవుడ్‌లో ఆమె ఎంట్రీ అంత ఈజీగా జరగలేదు. 'నాడోడిగల్' సినిమాకు అభినయ ఫోటోను చూసిన డైరెక్టర్ సముద్రఖని ఆమెను వెంటనే ఓకే చేశాడు. అయితే ఆమె మూగ, చెవిటి అని తెలియడంతో వద్దని చెప్పి ముంబై నుంచి ఓ హీరోయిన్‌ను తీసుకొచ్చాడు. తీరా ఆమె సెట్‌లో ఈ తమిళ భాష ఏంటోనంటూ చిరాకు పడి చివరకు చేయనని చెప్పేసింది. దీంతో డైరెక్టర్ మాటలు రాకపోయిన అభినయతోనే సినిమా తీయాలని ఫిక్సయ్యాడు.
సౌత్ టు హాలీవుడ్
కట్ చేస్తే సినిమా సూపర్ హిట్. పదికిపైగా అవార్డులు వచ్చిపడ్డాయి. ఈ సినిమా తెలుగులో శంభో శివ శంభోగా రిలీజైంది. అభినయ భాషతో సంబంధం లేకుండా ఎన్నో సినిమాలు చేసింది. తన కెరీర్‌లో ఉత్తమ సహాయ నటిగా పలు అవార్డులు సైతం అందుకుంది. ఆమె ఇక్కడితోనే పరిమితం కాలేదు. హాలీవుడ్‌లో ఒన్ లిటిల్ ఫింగర్ అనే సినిమా సైతం చేసింది. తనలోని వైకల్యాన్ని చూసి బాధపడకుండా ఆత్మస్థైర్యంతో ముందుకు సాగుతూ ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తోంది. ప్రస్తుతం ఆమె మార్క్ ఆంటోని సినిమాలో నటిస్తోంది.
చదవండి: స్టేజీపై విజయ్, సామ్ రొమాంటిక్ డ్యాన్స్.. అది సరే కానీ రౌడీ హీరో ఏంటి? మరీ..
Comments
Please login to add a commentAdd a comment