వేగవంతమైన ఇంటర్నెట్ త్వరలో
న్యూయార్క్: ఆన్‌లైన్‌లో వీడియోలు లోడ్‌కావడానికి ఎక్కువ సమయం పట్టడం మనందరికీ అనుభవంలోనిదే. దీనికి కారణం ఇంటర్నెట్ స్పీడ్ పరిమితంగా ఉండడమే. ఇకమీదట ఈ బాధ లేకుండా వేగవంతమైన ఇంటర్నెట్ ప్రసారానికి పరిశోధకులు మార్గం కనిపెట్టారు.
కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం పరిశోధకులు జరిపిన ఓ అధ్యయనంలో ఇంటర్నెట్‌ను ప్రసారం చేసే ఆప్టికల్ ఫైబర్స్‌లో డాటా ట్రాన్సిమిషన్ రేట్‌ను పెంచడం ద్వారా గంటకు 12,000 కిమీ వేగంతో ఇంటర్నెట్ ప్రసారం చేశారు. దీంతో ఆప్టికల్ ఫైబర్స్‌లో ప్రయాణానికి శక్తిని అందింబే రిపీటర్ల అవసరం ఉండబోదని, త్వరలో అందుబాటులోకి వస్తుందని పరిశోధకులు తెలిపారు.