California University
-
కళ్లు తిరిగి పడిపోయారా... అయితే ఇది చదవాల్సిందే!
మీరు ఎప్పుడైనా కళ్లు తిరిగి పడిపోయారా? మనలో కనీసం 40 శాతం మంది జీవితంలో ఏదో ఒక దశలో ఇలా కళ్లు తిరిగి పడిపోతారని సైన్స్ చెబుతోంది. ఒకట్రెండు నిమిషాలు మాత్రమే మనం ఇలా కళ్లు తిరిగి పడిపోయినప్పటికీ ఆ తరువాత మాత్రం బోలెడంత గందరగోళం మనల్ని అలముకుంటుంది. ఏం జరిగిందో తెలియదు. ఎందుకు పడిపోయామో అర్థం కాదు. మనకే కాదు.. శరీరం లోపల ఏం జరిగితే పడిపోయామో ఇప్పటివరకూ శాస్త్రవేత్తలకూ తెలియకపోవడం గమన్హాం. అదృష్టవశాత్తూ అమెరికాలోని శాండియాగోలో ఉన్న కాలిఫోర్నియా యూనివర్శిటీ శాస్త్రవేత్తలు ఇప్పుడు ఈ గుట్టును ఛేదించారు. కొన్ని రకాల ఆరోగ్య సమస్యలున్నప్పుడు ఇలా కళ్లు తిరిగి పడిపోవడం తరచుగా... ఎక్కువసార్లు జరుగుతూంటుంది కాబట్టి శాస్త్రవేత్తల ప్రయోగాలు ఈ సమస్యను అధిగమించేందుకు పనికొస్తాయని అంచనా. మరిన్ని వివరాలు తెలుసుకునేందుకు ముందు ఒక్క విషయం. కళ్లు తిరిగి పడిపోవడాన్ని వైద్య పరిభాషలో సింకోప్ అని పిలుస్తారు. కాలిఫోర్నియా వర్శిటీ శాస్త్రవేత్తల ప్రయోగాల పుణ్యమా అని సింకోప్ తాలూకూ సంకేతాలు గుండె మెదళ్ల మధ్య ప్రయాణించేందుకు కారణమైన జన్యువుల గురించి కూడా స్పష్టంగా తెలిసింది. మామూలుగా అయితే సింకోప్‌కు మెదడు గుండెకు పంపే సంకేతం కారణమని అనుకునేవాళ్లు. మెదడు ఆదేశాల మేరకు గుండె పనిచేసి కళ్లు తిరిగి పడిపోయేలా చేస్తుందనన్నది ఇప్పటివరకూ ఉన్న అంచనా. అయితే వినీత్ ఆగస్టీన్ నేతృత్వంలోని శాస్త్రవేత్తల బృందం పరిశోధించగా.. ఇందులో సగం మాత్రమే నిజమని తెలిసింది. సింకోప్‌కు ముందు గుండె కూడా మెదడుకు సంకేతం పంపుతోందని, ఇది మెదడు పనితీరును మార్చేస్తోందని స్పష్టమైంది. సింకోప్ సమయంలో గుండె కొట్టుకునే వేగం చాలా తక్కువగా ఉంటుందని, రక్తపోటు, ఊపిరి వేగం కూడా తక్కువగా ఉంటాయని 1867లో బెజోల్డ్ జారిష్ రిఫ్లెక్స్ (బీజేఆర్) అనే సిద్ధాంతం చెప్పింది కానీ ఇప్పటివరకూ ఇది రుజువు కాలేదు. కాలిఫోర్నియా వర్శిటీ శాస్త్రవేత్తలు మెదడు నుంచి శరీరానికి సంకేతాలు పంపే అత్యంత కీలకమైన వాగస్ నాడిని పరిశీలించారు. ఈ వాగల్ సెన్సిరీ న్యూరాన్లు మెదడు స్టెమ్ (కాండ భాగం)కు సంకేతాలు పంపుతుందని, బీజేఆర్ లక్షణాలకు, సింకోప్‌కు దీనికి సంబంధం ఉందని అంచనా. ఈ వాగల్ సెన్సిరీ న్యూరాన్లు విడుదల చేసే రెండు రకాల పెప్టైడ్లను అందించినప్పుడు ఎలుకలు ఠక్కున మూర్ఛపోయాయి. తరువాతి పరిశీలనల్లో ఎన్‌పీవై2ఆర్ అనే పెప్టైడ్ సింకోప్‌లో ప్రధాన పాత్ర పోషిస్తున్నట్లు స్పష్టమైంది. ఈ ఫలితాల సాయంతో సింకోప్‌ను అరికట్టేందుకు కొత్త మందులు తయారు చేయవచ్చునని, పలు మానసిక, నాడీ సంబంధిత సమస్యలకు పరిష్కారాలు కనుక్కోవచ్చునని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త తెలిపారు. పరిశోధన వివరాలు ‘నేచర్’ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. -
అద్భుత విజయం: పక్షవాతానికి గురైన వ్యక్తి నుంచి..
కాలిఫోర్నియా యూనివర్సిటీ పరిశోధకులు అరుదైన ఘనత సాధించారు. పక్షవాతానికి గురై పూర్తిగా మాట్లాడే శక్తిని కోల్పోయిన వాళ్ల నుంచి.. చెప్పదల్చుకున్న విషయాల్ని బయటకు రప్పించే టెక్నాలజీని రూపొందించారు. ‘స్పీచ్ న్యూరోప్రోస్థెసిస్’ Speech Neuroprosthesisతో అభివృద్ధి చేసిన ఈ టెక్నాలజీ.. బ్రెయిన్ నుంచి గొంతు ద్వారా సిగ్నల్స్ సేకరించి, అటుపై పేషెంట్లు చెప్పదల్చుకున్న విషయాన్ని ఎదురుగా ఉన్న తెరపై వేగంగా డిస్ప్లే చేస్తాయి. ఫ్లోరిడా: కాలిఫోర్నియా యూనివర్సిటీ(UCSF) న్యూరోసర్జన్ డాక్టర్ ఎడ్వర్డ్ ఛాంగ్ నేతృత్వంలోని బృందం పదేళ్ల పరిశోధనల తర్వాత ఈ విజయాన్ని సాధించింది. ఇంతకు ముందు ఇలాంటి పరిశోధనలే జరిగినప్పటికీ.. చేతి కండరాల కదలికల ద్వారా చెప్పదల్చుకున్న విషయాన్ని రాబట్టడం లాంటి ఫలితాలొచ్చాయి. కానీ, కాలిఫోర్నియా బృందం సాధించిన విజయంలో.. నేరుగా స్వర వ్యవస్థకే అనుసంధానమై ఉండడం వల్ల ఒక్కో అక్షరం కాకుండా, ఒకేసారి ఎక్కువ పదాలను తెరపై చూపించేందుకు ఆస్కారం ఏర్పడింది. తద్వారా సాధారణ వ్యక్తి మాట్లాడగలిగినట్లే.. పెరాలసిస్ బారినపడ్డ వ్యక్తి నుంచి(75 శాతం) సందేశాలను ఆశించొచ్చు. పైగా ఇది సంక్లిష్టమైన పద్ధతి కాదని, పేషెంట్లకు ఎలాంటి ఇబ్బందులు ఉండబోవని డాక్టర్ ఎడ్వర్డ్ ఛాంగ్ వెల్లడించారు. ‘స్టెనో’ పేరుతో కొనసాగిన ఈ ప్రాజెక్ట్‌కు ఫేస్బుక్ స్పాన్సర్ చేసింది. పక్షవాతానికి గురైన వ్యక్తి నుంచి సహజంగా పదాలను బయటకు తెప్పించడం నిజంగా ఓ అద్బుత విజయంగా పేర్కొంటూ న్యూ ఇంగ్లండ్ జర్నల్ ఆఫ్ మెడిసిన్‌లో బుధవారం ఈ పరిశోధనకు సంబంధించిన విషయాల్ని ప్రచురించింది. కేవలం పక్షవాతానికి గురైమాత్రమే కాదు.. ఎంతో మంది రోడ్డు ప్రమాదాల్లో, షాక్‌లతో మాట్లాడలేని స్థితికి చేరుకుంటుంటారు. వాళ్ల కోసం ఈ న్యూరాల్ టెక్నాలజీ ఉపయోగపడొచ్చని ఆ జర్నల్‌లో పలువురు వైద్యు నిపుణులు అభిప్రాయపడ్డారు. జుకర్‌బర్గ్ ఖుష్ బ్రెయిన్ కంప్యూటర్ ఇంటర్ఫేస్ ద్వారా(సిగ్నల్స్ చేరివేత ద్వారా) పేషెంట్ చెప్పాలనుకున్న విషయం తెరపై దానికదే టైప్ కావడం ఈ న్యూరల్ టెక్నాలజీ ప్రత్యేకం. ఇక తమ సౌజన్యంతో రూపొందించిన ఈ న్యూరల్ టెక్నాలజీ ఘన విజయంపై ఫేస్బుక్ అధినేత మార్క్ జుకర్‌బర్గ్ హర్షం వ్యక్తం చేశాడు. ఈ మేరకు ఫేస్బుక్ అకౌంట్లో ఒక పోస్ట్ పెట్టాడు. ‘బ్రావో’ పేరుతో జరిగిన ఈ అధ్యయనంలో 15 ఏళ్ల క్రితం యాక్సిడెంట్లో గాయపడి కదల్లేని స్థితికి చేరుకున్న ఓ వ్యక్తిపై కాలిఫోర్నియా ప్రొఫెసర్లు పరిశోధనలు చేశారు. ‘నాకేం దాహంగా లేదు, నా వాళ్లను పిలవండి, బాగానే ఉన్నా’ లాంటి పదాల్ని ఆ వ్యక్తి వ్యక్తం చేశాడు. -
లైంగిక వేధింపులు.. రూ.7 వేల కోట్లకు సెటిల్మెంట్
లాస్ ఏంజెలిస్: మాజీ క్యాంపస్ గైనకాలజిస్ట్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన వందలాది మంది మహిళలకు 1 బిలియన్ డాలర్లకు పైగా(7,246,00,00,000 రూపాయలు) చెల్లించడానికి కాలిఫోర్నియాలోని ఒక ఉన్నత విశ్వవిద్యాలయం అంగీకరించింది. ఈ విషయాన్ని బాధితుల తరఫు న్యాయవాది ఒకరు గురువారం మీడియాకు వెల్లడించారు. అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ సౌత్ కాలిఫోర్నియా(యూఎస్సీ) ఈ మొత్తాన్ని చెల్లించేందుకు అంగీకరిస్తున్నట్లు లాస్ ఏంజెలిస్ కోర్టుకు తెలిపింది. గతంలో 2018లో ఫెడరల్ క్లాస్ చర్య ఫలితంగా ఇప్పటికే 215 మిలియన్ డాలర్లు చెల్లించింది. ఈ సందర్భంగా న్యాయవాది గ్లోరియా ఆల్రెడ్ మాట్లాడుతూ.. ‘‘సివిల్ లిటిగేషన్ చరిత్రలో లైంగిక వేధింపుల కేసులో ఇంత భారీ మొత్తంలో చెల్లించడానికి అంగీకరించడం ఇదే ప్రథమం’’ అన్నారు. ఈ లైంగిక వేధింపులకు పాల్పడిన ప్రబుద్ధుడు ఎవరు.. ఏంటి అనే వివరాలు.. జార్జి టిండాల్(74) అనే వ్యక్తి తన 30 ఏళ్ల సర్వీసులో వందల మంది మహిళలను లైంగిక వేదింపులకు గురి చేశాడు. వీరిలో మైనర్ల నుంచి మధ్య వయసు మహిళల వరకు ఉన్నారు. మెడికల్ చెకప్ కోసం వచ్చిన ఆడవారిని టిండాల్ లైంగికంగా వేధించేవాడు. రోగుల వ్యక్తిగత శరీర అవయాలను ఫోటోలు తీయడం.. ప్రైవేట్ పార్ట్స్‌ని తాకడం.. శరీరాకృతి గురించి చండాలమైన కామెంట్స్ చేయడం వంటివి చేసేవాడు. అంతేకాక యూనివర్సిటీలో ఎక్కువగా ఉన్న ఆసియా ఖండం విద్యార్థులను టార్గెట్ చేసి వేధింపులకు పాల్పడేవాడు. ఇలా సాగిపోతున్న ఇతడి అరాచకాల గురించి 1990లో మొదటి సారి ఓ టీనేజ్ యువతి ఫిర్యాదు చేయడంతో టిండాల్ బాగోతం వెలుగులోకి వచ్చింది. మెడికల్ చెకప్ కోసం వెళ్లిన తనను టిండాల్ అసభ్యకర రీతిలో తాకుతూ.. అత్యాచారం చేశాడని తెలిపింది. ఈ టిండాల్‌పై వచ్చిన ఆరోపణలపై స్పందించడంలో విఫలమైనందుకు వేలాది మంది మాజీ రోగులు విశ్వవిద్యాలయంపై కేసు వేశారు. వైద్యుడి చర్యల గురించి సంస్థకు తెలుసని.. అయినప్పటికి అతడిపై చర్యలు తీసుకోకుండా సర్వీసులోనే కొనసాగించారని బాధితులు ఆరోపించారు. పైగా 2016 వరకు యూఎస్సీ అధికారులు టిండాల్‌పై వచ్చిన ఆరోపణలపై దర్యాప్తు చేయలేదని.. ఈ విశ్వవిద్యాలయంతో ఉన్న స్నేహపూర్వక ఒప్పందం వల్ల టిండాల్ పదవీ విరమణ చేయడానికి అంగీకరించారని బాధితులు తెలిపారు. ఈ ఆరోపణలకు సంబంధించి యూఎస్సీ ఇప్పటికే 200,000 డాలర్టు(1,45,23,803 రూపాయలు) చెల్లించినట్లు తెలిసింది. "కొన్నిసార్లు అతడి వద్ద పరీక్షలకు హాజరైన నర్సులు టిండాల్ దుర్మర్గాలను ప్రత్యక్షంగా చూశారని’’ న్యాయవాది తెలిపారు. బాధితుల తరఫు న్యాయవాది మాట్లాడుతూ.. ‘‘యూఎస్సీ హెల్త్ సెంటర్లో ఎన్నో వందల మంది మహిళలు ఏళ్ల తరబడి లైంగిక వేధింపులకు గురయ్యారు. ఈ ఆరోపణలకు సంబంధించి యూఎస్సీ పలు తప్పుడు కథనాలను మీడియా ద్వారా ప్రచారం చేస్తోంది. ఇవన్ని అవాస్తవాలని మేం నిరూపించగలం. అలానే తమకు జరిగిన అన్యాయం గురించి ఫిర్యాదు చేయడానికి వచ్చిన మహిళలను నేను అభినందిస్తున్నాను. వారి ధైర్యాన్ని మెచ్చుకుంటున్నాను’’ అన్నారు. ఇక నేరం రుజువైతే టిండాల్ 53 ఏళ్ల పాటు జైళ్లో ఉంటాడు. చదవండి: తండ్రి లైంగిక వేధింపులు: కాల్చి పడేసిన కూతురు -
పది నిమిషాల్లోనే వైరస్ నిర్ధారణ!
లాస్ఏంజెలిస్: కరోనా వైరస్‌ను పది నిమిషాల్లోనే గుర్తించే ఓ వినూత్న పరికరాన్ని అభివృద్ధి చేయడంలో అమెరికాలోని కాలిఫోర్నియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ విజయం సాధించింది. రక్తం లేదా లాలాజలంలోని వైరస్‌ను గుర్తించేందుకు శాస్త్రవేత్తలు చౌకగా లభించే సెన్సర్లను వినియోగించడం విశేషం. అంతేకాదు... ఈ పరికరాన్ని ఇంట్లో ఎవరికి వారే వాడి వైరస్ ఉనికిని తెలుసుకోవచ్చు. గ్రాఫీన్ పొర సాయంతో గతంలోనే ఈ శాస్త్రవేత్తలు గౌట్ వంటి వ్యాధులను గుర్తించే పద్ధతిని అభివృద్ధి చేశారు. లేజర్ కిరణాల సాయంతో ప్లాస్టిక్ పొరపై అతి సూక్ష్మమైన కంతలను ఏర్పాటు చేయడం.. వీటిల్లో కరోనా వైరస్‌కు వ్యతిరేకంగా రోగనిరోధక వ్యవస్థ సృష్టించే యాంటీబాడీలను జోడించడం ముఖ్యమైన అంశం. (చదవండి: మరో 10 కోట్ల డోసుల వ్యాక్సిన్స్: సీరమ్) ర్యాపిడ్ ఫ్లెక్స్ అని పిలుస్తున్న ఈ కొత్త పరికరంలో యాంటీబాడీలతోపాటు కొన్ని ప్రొటీన్లు కూడా ఉంటాయి. తద్వారా వైరస్‌ను గుర్తించడంతోపాటు రోగ నిరోధక వ్యవస్థ స్పందనను, వ్యాధి తీవ్రతను సూచించే మార్కర్లను కూడా గుర్తించవచ్చు. ఇలా ఏకకాలంలో కరోనా వైరస్‌కు సంబంధించిన మూడు అంశాలను తెలుసుకోగలగడం.. చికిత్స విషయంలో చాలా కీలకపాత్ర పోషిస్తుందని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త వీ గావ్ తెలిపారు. కోవిడ్ పరీక్షల ఫలితాల కోసం ప్రస్తుతం కొన్ని గంటల సమయం పడుతున్న విషయం తెలిసిందే. సెన్సర్ బాగా పనిచేస్తుందని నమ్మకం కుదిరినప్పటికీ ర్యాపిడ్ ఫ్లెక్స్‌ను ప్రస్తుతానికి తాము పరిశోధనశాలలో మాత్రమే పరీక్షించామని చెప్పారు. (చదవండి: ఏడాది చివరికి కొవాక్జిన్) -
వాతావరణం నుంచి నత్రజనిని గ్రహించే మొక్కజొన్న!
పరస్పర ఆధారితంగా జీవించడమే ప్రకృతిలో అత్యద్భుతమైన సంగతి. సూక్ష్మజీవులు, మొక్కలు ఇచ్చి పుచ్చుకోవటం ద్వారా సజావుగా జీవనం సాగించడం విశేషం. మెక్సికో దేశంలో సియెర్ర మిక్సె అనే ఒక దేశవాళీ మొక్కజొన్న రకం.. తన పెరుగుదలకు అవసరమైన నత్రజనిని.. మేలుచేసే సూక్ష్మజీవరాశి ద్వారా సమకూర్చుకుంటూ.. సమస్యాత్మక నేలల్లోనూ నిక్షేపంగా చక్కని దిగుబడినిస్తోందని ఇటీవల శాస్త్రవేత్తలు గుర్తించారు. మొక్కజొన్న మొక్క కాండం కణుపుల వద్ద వేర్లు(ఏరియల్ రూట్స్) వంటివి పెరుగుతూ ఉంటాయి. కొన్ని మొక్కజొన్న జాతుల్లో బయట ఉండే ఈ వేర్లు పొడుగ్గా పెరిగి, భూమిలోకి చొచ్చుకెళ్తాయి కూడా. మొక్క పడిపోకుండా ఉండటానికి, నీటి తేమను అదనంగా గ్రహించడానికి ఇవి ఉపయోగపడుతుంటాయి. అయితే, తాజా పరిశోధనలో తేలిందేమంటే.. మెక్సికోలోని ఓక్సక దగ్గర ఒక ప్రాంతంలో నత్రజని లోపించిన నేలల్లో దేశవాళీ రకం మొక్కజొన్న మొక్కలు రసాయనిక ఎరువులు పెద్దగా వాడకపోయినా లేదా అసలు వాడకపోయినా నిక్షేపంగా పెరుగుతూ చక్కగా దిగుబడినిస్తున్నాయి. దీనిపై కాలిఫోర్నియా యూనివర్సిటీ(డేవిస్)కు చెందిన ప్రొ. అన్ బెన్నెట్, అల్లెన్ వాన్ డెన్జ్ నేతృత్వంలో శాస్త్రవేత్తలు సుదీర్ఘ పరిశోధన జరిపిన తర్వాత ఇటీవల నిర్ధారణకు వచ్చిందేమంటే.. సూక్ష్మజీవుల ద్వారా ఈ మొక్కజొన్న మొక్కలు నత్రజనిని అసాధారణంగా గ్రహిస్తున్నాయని! మొక్కజొన్న మొక్కల కాండానికి ఉన్న కణుపుల దగ్గర గాలిలో తేలాడుతుండే వేర్లు(ఏరియల్ రూట్స్) ఒక రకమైన జిగురు వంటి తీపి ద్రవాన్ని స్రవిస్తుంటాయి. తద్వారా మేలు చేసే సూక్ష్మజీవరాశిని ఇవి ఆకర్షిస్తున్నాయి. మేలు చేసే సూక్ష్మజీవులు ఈ తీపి ద్రవాన్ని ఆహారంగా స్వీకరించి జీవిస్తూ.. అందుకు ప్రతిగా వాతావరణంలోని నత్రజనిని గ్రహించి మొక్కజొన్న మొక్క కణజాలానికి అందిస్తూ రుణం తీర్చుకుంటున్నాయి. 29–82% వరకు నత్రజనిని ఈ సూక్ష్మజీవులు మొక్కజొన్న మొక్కలకు అందిస్తున్నాయని తేలింది. పప్పుధాన్య పంటలు తమ వేరు వ్యవస్థలోని మేలు చేసే సూక్ష్మజీవుల ద్వారా వాతావరణంలోని నత్రజనిని స్థిరీకరిస్తున్నాయని మనకు తెలుసు. అయితే, ఏకదళ జాతికి చెందిన మెక్సికోకు చెందిన మొక్కజొన్న నత్రజనిని వాతావరణం నుంచి గ్రహిస్తుండటం శాస్త్రవేత్తలను సైతం ఆశ్చర్యపరచిన వాస్తవం! ప్రధాన ఆహార పంటయిన మొక్కజొన్న సాగులో శిలాజ ఇంధనాల ద్వారా ఉత్పత్తి చేసిన రసాయనిక ఎరువులను ప్రపంచవ్యాప్తంగా విస్తారంగా వాడుతున్న నేపథ్యంలో.. అసలు నత్రజని ఎరువులు వేయనవసరం లేని మొక్కజొన్న రకాలను, ఆ మాటకొస్తే జొన్న రకాలను సైతం సృష్టించడం సాధ్యపడవచ్చని ప్రొఫెసర్ బెన్నెట్, ఆయన సహచర శాస్త్రవేత్తలు ఉత్సుకతతో భావిస్తున్నారు. ‘కొన్ని దేశవాళీ మొక్కజొన్న రకాలు కొన్నిటికి వాతావరణం నుంచి నత్రజనిని గ్రహించే శక్తి ఉన్న విషయం మాకు కొత్తేమీ కాదు. అయితే, సియెర్ర మిక్సె రకం దేశీ మొక్కజొన్నకు ఆ లక్షణం ఉంది? ఆ మొక్కకు అవసరమయ్యే నత్రజనిని సూక్ష్మజీవ రాశి ద్వారా ఎంతమేరకు వాస్తవంగా గ్రహిస్తున్నదీ నిర్ధారించుకోవడానికి, అనేక విభాగాల శాస్త్రవేత్తలు కలిసి పనిచేస్తే, మాకు పదేళ్లు పట్టింది’ అని ప్రొ. బెన్నెట్ అన్నారు. -
సైక్లింగ్‌తో లైంగిక ఆరోగ్యానికి మేలు
న్యూయార్క్: సైకిల్ తొక్కే అలవాటు ఉన్న వారికి లైంగిక పరమైన సమస్యలు వస్తాయనేది అపోహేనని ఓ అధ్యయనంలో తేలింది. సైకిల్ తొక్కటం వల్ల నష్టాల కంటే లాభాలే ఎక్కువగా ఉన్నాయని శాన్ఫ్రాన్సిస్కోలోని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా పరిశోధకులు తేల్చారు. స్విమ్మింగ్, రన్నింగ్ చేసే వారితో పోలిస్తే సైక్లింగ్ చేసేవారికి లైంగిక పటుత్వం ఎక్కువగా ఉంటున్నట్లు తేలిందని వీరు చెబుతున్నారు. సైక్లింగ్‌తో కార్డియోవాస్యులర్ లాభాలతోపాటు కీళ్ల సమస్యలు కూడా తగ్గుతాయన్నారు. సైక్లిస్ట్లలో బరువు సంబంధ సమస్యలు కూడా చాలా వరకు దూరమైనట్లు పరిశోధకుల్లో ఒకరైన ప్రొఫెసర్ బెంజమిన్ బ్రేయర్ వివరించారు. అధ్యయనంలో భాగంగా 2,774మంది సైక్లిస్టులు, 539మంది స్విమ్మర్లు, 789 మంది రన్నర్స్‌ను పరిశోధకులు ఎంపిక చేసుకున్నారు. -
గత 12 ఏళ్లలో తొలిసారిగా...
కాలిఫోర్నియా వర్సిటికీ తగ్గిన విదేశీ దరఖాస్తులు శాన్ఫ్రాన్సిస్కో: గత 12 ఏళ్లలో తొలిసారిగా అమెరికాలోని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయానికి విదేశీ విద్యార్థుల నుంచి వచ్చే దరఖాస్తుల సంఖ్య తగ్గింది. అంతకుముందు దాదాపు దశాబ్దకాలం పాటు ఈ యూనివర్సిటీకి వచ్చే విదేశీ విద్యార్థుల దరఖాస్తుల సంఖ్యలో ప్రతి ఏడాది సగటున 21 శాతం వృద్ధి నమోదయ్యేది. ఈ విశ్వవిద్యాలయంలో 2017లో కోర్సుల్లో చేరడానికి దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ నవంబరుతో ముగిసింది. ఆ నెలలోనే ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికవ్వడం తెలిసిందే. అత్యధికంగా మెక్సికో నుంచి వచ్చే దరఖాస్తుల్లో 30 శాతం తగ్గిపోగా, ముస్లిం ప్రజలు ఎక్కువగా ఉండే దేశాల నుంచి ఈసారి 10 శాతం తక్కువ సంఖ్యలో దరఖాస్తులు వచ్చాయి. -
‘మయన్ ’ లాకెట్ గుర్తింపు
వాషింగ్టన్ : పురాతన మయన్ రాజ్యానికి చెందిన పచ్చ లాకెట్‌ను శాస్త్రవేత్తలు కనుగొన్నారు. అమెరికాలోని ఒకప్పటి మయన్ రాజ్య శిఖరాలపై ఉన్న దక్షిణ బెలిజ్ ప్రాంతంలో 2015లో జరిపిన తవ్వకాల్లో ఇది బయటపడగా, తాజాగా దీన్ని అప్పటి మయన్ రాజుకి చెందినదిగా గుర్తించారు. అలాగే లాకెట్‌ను ధరించిన మొదటిరాజుకి సంబంధించిన వివరాలను దీనిపై చెక్కిఉన్నట్లు వారు పేర్కొన్నారు. ఆంగ్ల అక్షరం ‘టీ’ఆకారంలో ఉండే ఈ లాకెట్ 7.4 అంగుళాల వెడల్పు, 4.1 అంగుళాల పొడవు ఉండి 0.3 అంగుళాల మందం ఉందని వెల్లడించారు. ఇప్పటివరకు కనుగొన్న లాకెట్ల్లో ఇది రెండో అతిపెద్దదని కాలిఫోర్నియా వర్సిటీ ప్రొఫెసర్ జెఫ్రీ బ్రాస్‌వెల్ చెప్పారు. దీనిని క్రీస్తు శకం 672 సంవత్సరంలో వాడినట్లుగా దానిపై ఉన్న చిత్రలిపిని బట్టి అర్థమవుతోందని తెలిపారు. -
కాలిఫోర్నియా యూనివర్శిటీకి కాషాయం రంగు
కాలిఫోర్నియా: కాలిఫోర్నియా యూనివర్శిటీ కాషాయం రంగు పులుముకుంటోంది. విద్య అనేది మతాలకు అతీతంగా విజ్ఞాన సముపార్జనే లక్ష్యంగా కొనసాగాలి. కానీ అలా జరగడం లేదని నాన్ ప్రాఫిట్ విద్యా సంస్థగా పనిచేస్తున్న కాలిఫోర్నియా యూనివర్శిటీలో ధర్మ సివిలైజేషన్ ఫౌండేషన్‌కు నాలుగు ‘చేర్స్’ ఉండడమే ప్రత్యక్ష ఉదాహరణ. భారత్‌లో ఆరెస్సెస్ మూలాలున్న ఈ ఫౌండేషన్ అమెరికాలోని ‘హిందూ స్వయం సేవక్ సంఘ్’ మద్దతుతో నడుస్తోంది. ఫౌండేషన్ సభ్యులందరూ ఆరెస్సెస్‌తో సంబంధాలున్న వారే. వేదాలు, భారతీయ హిందూ సంస్కృతిని అధ్యయనం చేసే విద్యార్థులకు ధర్మ ఫౌండేషన్‌కు చెందిన యూనివర్శిటీలోని నాలుగు చేర్స్ స్పాన్సర్ షిప్ అందిస్తోంది. భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో బీజేపీ ప్రభుత్వం భారత్‌లో అధికారంలోకి వచ్చిన తర్వాతనే ధర్మ ఫౌండేషన్ కాలిఫోర్నియా యూనివర్శిటీలో నాలుగు చేర్స్ను దక్కించుకోవడం, వాటికి సంబంధించి ఒప్పందాలు కుదుర్చుకోవడం ఇక్కడ గమనార్హం. 2015 జనవరి, ఏప్రిల్, అక్టోబర్ నెలల్లో ఈ ఒప్పందాలు జరిగాయి. ఆర్థిక ఇబ్బందులు ఎదొర్కొంటున్న కాలిఫోర్నియా యూనివర్శిటీ, ముఖ్యంగా 2000 సంవత్సరం నుంచి ప్రైవేటు సంస్థలనుంచి విరాళాలు స్వీకరిస్తోంది. 15 లక్షల డాలర్ల విరాళాలు ఇచ్చిన సంస్థకు ఒక్కో చేర్ చొప్పున కేటాయించాలనే నిర్ణయం తీసుకొంది. అందులో భాగంగానే ధర్మ ఫౌండేషన్ 60 లక్షల డాలర్ల విరాళాలను ఇచ్చి నాలుగు కుర్చీలను దక్కించుకుంది. మ్యాచింగ్ గ్రాంట్ కింద యూనివర్శిటీ కూడా ఇంతకంటే ఎక్కువే నిధులే ఇవ్వాల్సి వస్తోంది. ఈ కుర్చీలకు చైర్మన్‌గా వ్యవహరించే వ్యక్తిగానీ, కౌన్సిల్ సభ్యులకుగానీ పదవీ విరమణకు కాలపరిమితి అనేది ఉండదు. ఈ కుర్చీలు సూచించిన అంశాల్లో అధ్యయనం చేయాల్సి ఉంటుంది. అడ్మిషన్ల ప్రక్రియలోకూడా ఈ కుర్చీల ప్రభావం ఉంటుంది. ఇప్పుడు ఈ నాలుగు చైర్ల వ్యవహారశైలిపై కాలిఫోర్నియా యూనివర్శిటీ విద్యార్థులు, ఫ్యాకల్టీ లీడర్లు ఆందోళన చేస్తున్నారు. పర్శియన్ స్టడీస్, కల్డర్ అండ్ అమెరికా స్టడీస్‌కు సంబంధించి కూడా యూనివర్శిటీల్లో చైర్స్ ఉన్నాయని, వాటికి మత సంస్థలకు ఎలాంటి సంబంధం లేదని ధర్మ ఫౌండేషన్‌కు వ్యతిరేకంగా పిటిషన్ దాఖలు చేసిన ఆలి హో ఒలోమీ అనే 29 ఏళ్ల గ్రాడ్యువేట్ విద్యార్థి తెలిపారు. ధర్మ సంస్థ తమ అకాడమీ విద్యపై ప్రభావం చూపిస్తోందని ఆయన ఆరోపించారు. భారతీయ చరిత్ర గురించి అధ్యయనం చేసేందుకు ఏ విద్యార్థికి ఎలాంటి అభ్యంతరం లేదని, అయితే ధర్మ సంస్థ సూచిస్తున్న పాఠ్యాంశాల పట్లనే తమకు అభ్యంతరం ఉందని యూనివర్శిటీలో ‘ఫిల్మ్ అండ్ మీడియా స్టడీస్’ ఫ్యాకల్టీకి చెందిన ప్రొఫెసర్ క్యాథెరిన్ లియూ చెప్పారు. భారతీయ సంస్కృతి, చరిత్రకు సంబంధించి ‘పెంగ్విన్ ఇండియా’ ప్రచురించిన పుస్తకాలు చదవొద్దని ఆంక్షలు పెట్టడం మరీ దారుణమని అన్నారు. భవిష్యత్‌లో ధర్మ ఫౌండేషన్‌కు వ్యతిరేకంగా తమ ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తున్నామని విద్యార్థులు చెబుతున్నారు. ప్రభుత్వేతర స్వచ్ఛంద సంస్థగా చెలామణి అవుతున్న ధర్మ ఫౌండేషన్ అంతర్జాతీయంగా విరాళాలు సేకరిస్తున్న విషయం తెల్సిందే. -
వేగవంతమైన ఇంటర్నెట్ త్వరలో
న్యూయార్క్: ఆన్లైన్లో వీడియోలు లోడ్కావడానికి ఎక్కువ సమయం పట్టడం మనందరికీ అనుభవంలోనిదే. దీనికి కారణం ఇంటర్నెట్ స్పీడ్ పరిమితంగా ఉండడమే. ఇకమీదట ఈ బాధ లేకుండా వేగవంతమైన ఇంటర్నెట్ ప్రసారానికి పరిశోధకులు మార్గం కనిపెట్టారు. కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం పరిశోధకులు జరిపిన ఓ అధ్యయనంలో ఇంటర్నెట్ను ప్రసారం చేసే ఆప్టికల్ ఫైబర్స్‌లో డాటా ట్రాన్సిమిషన్ రేట్‌ను పెంచడం ద్వారా గంటకు 12,000 కిమీ వేగంతో ఇంటర్నెట్ ప్రసారం చేశారు. దీంతో ఆప్టికల్ ఫైబర్స్‌లో ప్రయాణానికి శక్తిని అందింబే రిపీటర్ల అవసరం ఉండబోదని, త్వరలో అందుబాటులోకి వస్తుందని పరిశోధకులు తెలిపారు.