‘మయన్ ’ లాకెట్ గుర్తింపు
వాషింగ్టన్ : పురాతన మయన్ రాజ్యానికి చెందిన పచ్చ లాకెట్‌ను శాస్త్రవేత్తలు కనుగొన్నారు. అమెరికాలోని ఒకప్పటి మయన్ రాజ్య శిఖరాలపై ఉన్న దక్షిణ బెలిజ్ ప్రాంతంలో 2015లో జరిపిన తవ్వకాల్లో ఇది బయటపడగా, తాజాగా దీన్ని అప్పటి మయన్ రాజుకి చెందినదిగా గుర్తించారు.
అలాగే లాకెట్‌ను ధరించిన మొదటిరాజుకి సంబంధించిన వివరాలను దీనిపై చెక్కిఉన్నట్లు వారు పేర్కొన్నారు. ఆంగ్ల అక్షరం ‘టీ’ఆకారంలో ఉండే ఈ లాకెట్ 7.4 అంగుళాల వెడల్పు, 4.1 అంగుళాల పొడవు ఉండి 0.3 అంగుళాల మందం ఉందని వెల్లడించారు. ఇప్పటివరకు కనుగొన్న లాకెట్‌ల్లో ఇది రెండో అతిపెద్దదని కాలిఫోర్నియా వర్సిటీ ప్రొఫెసర్ జెఫ్రీ బ్రాస్‌వెల్ చెప్పారు. దీనిని క్రీస్తు శకం 672 సంవత్సరంలో వాడినట్లుగా దానిపై ఉన్న చిత్రలిపిని బట్టి అర్థమవుతోందని తెలిపారు.