ఆకతాయిల నుంచి రక్షించే లాకెట్‌.. ఎలాగంటారా.. | SAFER Smart Jewellery For Women Protection | Sakshi
Sakshi News home page

ఆకతాయిల నుంచి రక్షించే లాకెట్‌.. ఎలాగంటారా..

Mar 6 2024 12:42 PM | Updated on Mar 7 2024 9:15 AM

Safer Smart Jewellery For Women Protection - Sakshi

ఆకతాయిలుంటున్న సమాజంలో మహిళలకు రక్షణ కరవైంది. వేధింపుల నుంచి మహిళలకు రక్షణ కల్పించే విధంగా పోలీస్‌ శాఖ పటిష్టమైన భద్రత కల్పిస్తూ ప్రత్యేక నిఘా ఏర్పాటు చేస్తున్నా ఆకతాయిల ఆగడాలను పూర్తిగా కట్టడి చేయలేకపోతున్నారు.

టెక్నాలజీ పెరుగుతున్న నేపథ్యంలో మహిళలకు భద్రత కల్పించేలా పలు యాప్స్‌ అందుబాటులోకి వస్తున్నాయి. అందులో భాగంగా అపరిచితులు వెంబడిస్తునప్పుడు మనం ప్రమాదంలో ఉన్నామనే విషయాన్ని కుటుంబ సభ్యులు, స్నేహితులకు తెలియజేసేలా ప్రత్యేక ‘స్మార్ట్‌ జ్యూవెలరీ’ని రూపొందించారు. 

ఈ ‘సేఫర్‌ స్మార్ట్‌ జ్యూవెలరీ’లో లాకెట్‌ ఉంటుంది. అది మొబైల్‌ యాప్‌తో కనెక్ట్‌ చేసుకొని మనకు కావాల్సినవారి నంబర్లు సెట్‌ చేసుకోవాలి. దీన్ని చెయిన్‌లా మెడలో వేసుకుని ప్రమాదం వచ్చినప్పుడు లాకెట్‌ వెనుక బటన్‌ని రెండుసార్లు నొక్కితే చాలు. మనకు కావాల్సిన వారికి మనం ప్రమాదంలో ఉన్నామని మెసేజ్‌ వెళ్తుంది. 

ఇదీ చదవండి: విమానం కంటే వేగంగా వెళ్లే రైలు.. ప్రత్యేకతలివే..

అంతేకాదు, యాప్‌ నుంచి మీ లైవ్‌ లొకేషన్‌ కూడా షేర్‌ అవుతుంది. దీంతో మిమ్మల్ని వారు సులభంగా చేరుకోగలుగుతారు. అలాగే, ప్రమాదంలో ఉన్నవారు సమీపంలోని హాస్పిటల్ లేదా పోలీస్ స్టేషన్‌కి వెళ్లేలా నావిగేట్ చేసుకోవచ్చు. ఆండ్రాయిడ్‌, ఐఓఎస్‌లోని యాప్‌ల ద్వారా ఈ స్మార్ట్‌లాకెట్‌ను కనెక్ట్‌ చేసుకునేలా ఏర్పాటు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement