సైక్లింగ్‌తో లైంగిక ఆరోగ్యానికి మేలు | Cycling does not affect men’s sexual health, new study finds | Sakshi
Sakshi News home page

సైక్లింగ్‌తో లైంగిక ఆరోగ్యానికి మేలు

Published Sat, Jan 13 2018 4:07 AM | Last Updated on Mon, Jul 23 2018 8:49 PM

Cycling does not affect men’s sexual health, new study finds - Sakshi

న్యూయార్క్‌: సైకిల్‌ తొక్కే అలవాటు ఉన్న వారికి లైంగిక పరమైన సమస్యలు వస్తాయనేది అపోహేనని ఓ అధ్యయనంలో తేలింది. సైకిల్‌ తొక్కటం వల్ల నష్టాల కంటే లాభాలే ఎక్కువగా ఉన్నాయని శాన్‌ఫ్రాన్సిస్కోలోని యూనివర్సిటీ ఆఫ్‌ కాలిఫోర్నియా పరిశోధకులు తేల్చారు. స్విమ్మింగ్, రన్నింగ్‌ చేసే వారితో పోలిస్తే సైక్లింగ్‌ చేసేవారికి లైంగిక పటుత్వం ఎక్కువగా ఉంటున్నట్లు తేలిందని వీరు చెబుతున్నారు. సైక్లింగ్‌తో కార్డియోవాస్యులర్‌ లాభాలతోపాటు కీళ్ల సమస్యలు కూడా తగ్గుతాయన్నారు. సైక్లిస్ట్‌లలో బరువు సంబంధ సమస్యలు కూడా చాలా వరకు దూరమైనట్లు పరిశోధకుల్లో ఒకరైన ప్రొఫెసర్‌ బెంజమిన్‌ బ్రేయర్‌ వివరించారు. అధ్యయనంలో భాగంగా 2,774మంది సైక్లిస్టులు, 539మంది స్విమ్మర్లు, 789 మంది రన్నర్స్‌ను పరిశోధకులు ఎంపిక చేసుకున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement