
అక్కినేని నాగచైతన్య ఈ ఏడాది కస్టడీ చిత్రంతో ప్రేక్షకులను అలరించాడు. తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మిక్స్‌డ్ టాక్‌ను సొంతం చేసుకుంది. అయితే ఈ మూవీ తర్వాత నాగ్ మరో క్రేజీ ప్రాజెక్ట్‌కు ఓకే చెప్పారు. చందు మొండేటి డైరెక్షన్‌లో నటిస్తున్నారు. ఈ చిత్రంలో నాగచైతన్య సరసన సాయి పల్లవి హీరోయిన్‌గా నటిస్తోంది. దీనికి సంబంధించి వివరాలను ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు.
(ఇది చదవండి: చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్‌కు 25 ఏళ్లు.. మెగాస్టార్ ఎమోషనల్ పోస్ట్)
అయితే తాజాగా నాగచైతన్య తన సింప్లిసిటీని మరోసారి చాటుకున్నారు. అయితే తన సిబ్బందిలో ఒకరు కొత్త బైక్ కొన్నారు. దీంతో అతని బైక్ నడపడమే కాకుండా.. తన ఆటోగ్రాఫ్ కూడా ఇచ్చారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఇది చూసిన ఫ్యాన్స్ సైతం క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.
ఇదిలా ఉండగా.. టాలీవుడ్ యంగ్ హీరో నాగచైతన్యకు బైక్స్, కార్లు అంటే చాలా ఇష్టం. ఆయన వద్ద ఇప్పటికే చాలా మోడల్స్ కూడా ఉన్నాయి. మార్కెట్‌లో కొత్త మోడల్స్ వస్తే వాటిని తన గ్యారేజ్‌లోకి తీసుకురావాల్సిందే. హైదరాబాద్ రోడ్లపై అప్పుడప్పుడు బైక్ రైడ్స్ చేస్తూ కనిపిస్తుంటారు.
(ఇది చదవండి: లెస్బియన్స్‌గా యంగ్ హీరోయిన్స్.. ఓటీటీలో దూసుకెళ్తోన్న మూవీ!)
Comments
Please login to add a commentAdd a comment