దేశీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన టూ వీలర్ తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ ఎట్టకేలకు 'మార్విక్ 440' బైక్ లాంచ్ చేసింది. దేశీయ విఫణిలో లాంచ్ అయిన ఈ బైక్ ధరలు రూ. 1.99 లక్షల నుంచి రూ. 2.24 లక్షల మధ్య ఉన్నాయి.
కంపెనీ ఈ బైక్ కోసం రూ. 5000 మొత్తంతో బుకింగ్స్ స్వీకరించడం ప్రారంభించింది. డెలివరీలు ఏప్రిల్ 15 నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉంది. అయితే మార్చి 15లోపల బుక్ చేసుకున్న కస్టమర్లకు రూ. 10000 విలువైన యాక్ససరీస్ లభించే అవకాశం ఉన్నట్లు సమాచారం.
చూడటానికి హార్లే డేవిడ్‌సన్ ఎక్స్440 మాదిరిగా ఉండే హీరో మార్విక్ 440 బైక్ 440 సీసీ ఇంజిన్ కలిగిన ఈ హీరో మావ్రిక్ 26 హార్స్ పవర్, 36 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజిన్ 6 స్పీడ్ గేర్‌బాక్స్ కలిగి ఉత్తమ పనితీరుని అందించనుంది.
డిజైన్, ఫీచర్స్ పరంగా అద్భుతంగా ఉన్న ఈ బైక్ మార్కెట్లో ఇప్పటికే అమ్మకానికి ఉన్న రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ 350, క్లాసిక్ 350, హోండా సిబి350, జావా 350 వంటి బైకులకు ప్రధాన ప్రత్యర్థిగా ఉంటుంది, కాబట్టి ఇది అమ్మకాల పరంగా గట్టి పోటీ ఎదుర్కోవాల్సి ఉంటుందని తెలుస్తోంది.
ఇదీ చదవండి: గర్ల్‌ఫ్రెండ్‌కు పువ్వులిచ్చేందుకు తిప్పలు - బ్లింకిట్‌లో యూజర్ చాట్ వైరల్
Comments
Please login to add a commentAdd a comment