భారతీయ క్రికెట్ చరిత్రలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న MS ధోని ఇటీవల 'టీవీఎస్ రోనిన్' బైక్ కొనుగోలు చేశారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇప్పటికే అనేక వాహనాలు కలిగిన ధోని గ్యారేజిలో ఇప్పుడు మరో అతిధి చేరింది.
దేశీయ మార్కెట్లో టీవీఎస్ కంపెనీ గతేడాది రోనిన్ బైక్ విడుదల చేసింది. ఈ బైక్ యొక్క బేస్ మోడల్ ధర రూ. 1,49,000 కాగా, టాప్ వేరియంట్ రూ. 1,68,750 వద్ద అందుబాటులో ఉంది. కంపెనీ అన్ని వేరియంట్స్‌ని డ్యూయెల్ టోన్ కలర్స్‌లో అందిస్తోంది. ఇందులో ధోని రోనిన్ టాప్ వేరియంట్ కొనుగోలు చేశారు.
ధోని డెలివరీ చేసుకున్న బైక్ విషయానికి వస్తే, ఇది 225 సీసీ ఇంజిన్ కలిగి 20 బిహెచ్‌పి పవర్ 20 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజిన్ 5-స్పీడ్ గేర్‌బాక్స్‌తో గరిష్టంగా గంటకు 120 కిమీ వేగవంతం అవుతుంది. ఈ బైక్ సైలెంట్ స్టార్ట్‌లను అనుమతించే ఇంటిగ్రేటెడ్ స్టార్టర్ జనరేటర్ సిస్టమ్‌ను కలిగి ఉంది.
టీవీఎస్ రోనిన్ రౌండ్ హెడ్‌ల్యాంప్, రియర్ వ్యూ మిర్రర్స్, టియర్ డ్రాప్ ఫ్యూయల్ ట్యాంక్ పొందుతుంది. ఫీచర్స్ విషయానికి వస్తే, ఇది SmartXonnect కనెక్టివిటీ కలిగి ఉండటం వల్ల టర్న్-బై-టర్న్ నావిగేషన్, రేస్ టెలిమెట్రీ, లో ఫ్యూయెల్ వార్ణింగ్, క్రాష్ అలర్ట్, కాల్ అండ్ ఎస్ఎమ్ఎస్ అలర్ట్ వంటి ఫీచర్స్ యాక్సెస్ చేయడానికి అనుమతిస్తుంది.
కొత్త రోనిన్ బైక్ డబుల్ క్రెడిల్ స్ప్లిట్ చాసిస్‌తో 41 మి.మీ అప్‌సైడ్ డౌన్ ఫ్రంట్ ఫోర్క్, వెనుకవైపు గ్యాస్ ఛార్జ్డ్ మోనోషాక్ పొందుతుంది. బ్రేకింగ్ విషయానికి వస్తే ఈ బైక్ ముందు, వెనుక భాగంలో స్పోర్ట్స్ డిస్క్ బ్రేక్‌లు ఉన్నాయి.
ఇప్పటికే కవాసకి నింజా హెచ్2, ఎక్స్132 హెల్‌క్యాట్, యమహా RD350, రాజ్‌దూత్, సుజుకి షోగన్, యమహా RX100, టీవీఎస్ అపాచీ 310, హార్లే డేవిడ్‌సన్, డుకాటీ వంటి 100 కంటే ఎక్కువ బైకులు కలిగి ఉన్నారు. తాజాగా ఇప్పుడు టీవీఎస్ రోనిన్ తన గ్యారేజిని అలంకరించింది.
Comments
Please login to add a commentAdd a comment