![Ducati Streetfighter V4 SP goes official at Rs35 lakh - Sakshi](/styles/webp/s3/article_images/2022/07/5/Ducati-1.jpg.webp?itok=tZpTy1Z5)
హైదరాబాద్: సూపర్‌బైక్స్ తయారీలో ఉన్న ఇటలీ సంస్థ డుకాటీ.. భారత్‌లో స్ట్రీట్‌ఫైటర్ వీ4 ఎస్‌పీ స్పోర్ట్ నేక్డ్ బైక్‌ను విడుదల చేసింది. ఈ బైక్ బుకింగ్‌లు , డెలివరీలను కూడా స్టార్ట్ చేసింది. ట్రాక్షన్ అండ్ వీల్ కంట్ట్రోల్ తోపాటు పలు ఎలక్ట్రానిక్ రైడింగ్ ఎయిడ్స్‌తో 'వింటర్ టెస్ట్' లివరీ లుక్‌తో అద్భుతమైన డిజైన్‌తో దీన్ని లాంచ్ చేసింది.
ధర ఎక్స్‌షోరూంలో రూ.34.99 లక్షలు. ఫీచర్ల విషయానికి వస్తే.. 1,103 సీసీ లిక్విడ్-కూల్డ్, డెస్మోసెడిసి స్ట్రాడేల్ ఇంజన్ ఇందులో అందిస్తోంది. సింగిల్ సీట్, కార్బన్ హీల్ గార్డ్స్‌తో అడ్జస్టబుబుల్ రైడర్ ఫుట్ పెగ్స్, 3 రైడింగ్ మోడ్స్, ఏబీఎస్ కార్నరింగ్ బాష్, ట్రాక్షన్ కంట్రోల్ ఈవో 2, స్లైడ్ కంట్రోల్, వీలీ కంట్రోల్, పవర్ లాంచ్, క్విక్ షిఫ్ట్ అప్/డౌన్ వంటి హంగులు ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment