అమెరికన్ టూవీలర్ కంపెనీ హార్లే డేవిడ్సన్ బైక్‌లంటే ప్రపంచవ్యాప్తంగా అత్యంత క్రేజ్ ఉంది. అత్యంత ఖరీదైన ఈ బైక్‌లను భారత్‌లోనూ చాలా మంది కొనుగోలు చేస్తుంటారు. అయితే ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న హార్లే డేవిడ్సన్ ఎక్స్440 (Harley-Davidson X440) ఫొటోలను కంపెనీ తాజాగా విడుదల చేసింది. హీరో మోటోకార్ప్ భాగస్వామ్యంతో భారత్‌లో వీటిని అభివృద్ధి చేసి తయారు చేయడం విశేషం.
కంపెనీ విడుదల చేసిన కొత్త ఫొటోల ఆధారంగా హార్లే డేవిడ్సన్ ఎక్స్440 ఇంజిన్, డిజైన్, హార్డ్‌వేర్‌కు సంబంధించిన ఇతర స్పెసిఫికేషన్లు ఎలా ఉండబోతున్నాయో నిపుణులు అంచనా వేస్తున్నారు.
ఇంజిన్
ఆయిల్-కూల్డ్ సింగిల్-సిలిండర్ 440సీసీ ఇంజన్ ఫొటోల్లో స్పష్టంగా కనిపిస్తోంది. రాయల్ ఎన్‌ఫీల్డ్ 350సీసీ మోటార్‌తో ఇది పోటీపడుతుంది. తరువాతి పవర్ ఫిగర్‌లు 20.2బీహెచ్‌పీ, 27ఎన్‌ఎం టార్క్. హార్లే-డేవిడ్సన్ 440సీసీ పవర్‌ట్రెయిన్ స్పెసిఫికేషన్‌లను వెల్లడించనప్పటికీ రాయల్ ఎన్‌ఫీల్డ్‌కు సమానమైన అవుట్‌పుట్‌ను కలిగి ఉంటుందని భావిస్తున్నారు.
డిజైన్
హార్లే డేవిడ్సన్ XR డిజైన్ ఎథోస్ నుంచి ప్రేరణ పొందిన ఎక్స్440 అనేది రోడ్‌స్టర్ అంటే ఇది ఫ్లాట్, విశాలమైన హ్యాండిల్‌బార్‌తో రైడర్‌లకు అనుకూలంగా ఉంటుంది. పాదాల పెగ్‌లు క్రూయిజర్ లాగా ముందుకు, వెనుకకు కదిలే వీలు ఉండదు కాబట్టి సీటింగ్ స్థానం తటస్థంగా ఉంటుంది. సరళమైన గుండ్రని ఆకారపు ఎల్‌ఈడీ హెడ్‌లైట్, వృత్తాకార ఇండికేటర్లు, అద్దాలు ఉంటాయి. స్లిమ్‌గా రూపొందించిన చతురస్రాకారపు ఇంధన ట్యాంక్‌పై హార్లే డేవిడ్సన్ ఎక్స్440 ట్యాగ్ ఉంటుంది.
హార్డ్‌వేర్
కొత్త ఎక్స్440 రెండు చక్రాలపై సింగిల్ డిస్క్ బ్రేక్‌లతో డ్యూయల్ ఛానల్ ఏబీఎస్, అప్‌సైడ్ డౌన్ ఫ్రంట్ ఫోర్క్స్, ప్రీ-లోడ్ అడ్జస్టబుల్ ట్విన్ రియర్ షాక్‌లతో వస్తుంది. ఎంఆర్‌ఎఫ్ టైర్లతో 18 అంగుళాల ఫ్రంట్ వీల్, 17 అంగుళాల రియర్ ఉంటాయి. అలాగే సింగిల్ పాడ్ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌తో వస్తుంది.
Soak in the beauty. The scenery isn’t too shabby either.
— Harley-Davidson Ind (@HarleyIndia) June 9, 2023
Come 3rd July, everything will change.
The H-D X440.#HarleyDavidson #HarleyDavidsonIndia #HD120 #HDIndia #HDX440 #X440
All pictures shown are for illustration purposes only. Actual products may vary. pic.twitter.com/onkurmHRY1
ధర
బజాజ్ ట్రయంఫ్ 400, హార్లే డేవిడ్సన్ ఎక్స్440 రెండు మోటార్‌సైకిళ్లూ పోటాపోటీగా వస్తున్నాయి. జులైలో వీటిని ఆయా కంపెనీలు మార్కెట్‌కు పరిచయం చేయనున్నాయి. రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350కి పోటీగా వస్తున్న హార్లే డేవిడ్సన్ ఎక్స్ 440 ఎక్స్ షోరూమ్ ధర రూ. 2.5 లక్షల నుంచి రూ. 3 లక్షలు ఉండవచ్చు.
ఇదీ చదవండి: Maruti Suzuki Jimny: మారుతీ జిమ్నీ వచ్చేసింది.. చవకైన 4X4 కారు ఇదే..
Comments
Please login to add a commentAdd a comment