ప్రముఖ అడ్వెంచర్ బైక్స్ తయారీ సంస్థ బీఎండబ్ల్యూ మోటోరాడ్ రెండు నెలల క్రితం దేశీయ విఫణిలో ఆర్ 1300 జీఎస్ లాంచ్ చేసిన తరువాత మరో బైక్ లాంచ్ చేయడానికి సిద్ధమైంది. ఇది అప్డేటెడ్ మిడ్ వెయిట్ 2024 ఎఫ్ 900 జీఎస్. ఈ బైక్ టీజర్‌లను సంస్థ ఇప్పటికే విడుడల చేసింది. దీన్ని బట్టి చూస్తే బీఎండబ్ల్యూ ఎఫ్ 900 జీఎస్ బైక్ త్వరలోనే లాంచ్ అవుతుందని తెలుస్తోంది.
చూడటానికి కొత్తగా కనిపించే బీఎండబ్ల్యూ ఎఫ్ 900 జీఎస్ బైక్ ముందు భాగం సైడ్ ఫెయిరింగ్‌లను పొందుతుంది. ఇందులో మల్టిపుల్ రైడింగ్ మోడ్‌లు, ట్రాక్షన్ కంట్రోల్, పెద్ద TFT డాష్ బోర్డు, కీలెస్ ఇగ్నిషన్, ఎల్ఈడీ లైటింగ్ వంటివి ఉన్నాయి. ఈ బైక్ బరువు దాని మునుపటి మోడల్ కంటే కూడా చాలా తక్కువ.
ఇదీ చదవండి: నిమిషానికి 693 రాఖీలు.. ఒక్కరోజులో సరికొత్త రికార్డ్!
బీఎండబ్ల్యూ ఎఫ్ 900 జీఎస్ బైక్ 895 సీసీ ఇంజిన్ కలిగి 105 బ్రేక్ హార్స్ పవర్, 93 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఇది 6 స్పీడ్ గేర్‌బాక్స్ పొందుతుంది. ఈ బైక్ ఆగస్టు చివరి నాటికి అధికారికంగా విడుదలవుతుందని సమాచారం. దీని ధర రూ. 13 లక్షల నుంచి రూ. 14.5 లక్షల మధ్య ఉంటుందని సమాచారం. ధరలు అధికారికంగా లాంచ్ సమయంలో వెల్లడవుతాయి.
Comments
Please login to add a commentAdd a comment