
న్యూఢిల్లీ: ద్విచక్ర వాహన తయారీలో ఉన్న హంగేరియన్ కంపెనీ కీవే తాజాగా కే-లైట్ 250వీ మోటార్‌సైకిల్‌ను లాంచ్ చేసింది. పరిచయ ఆఫర్‌లో రూ.2.89 లక్షలకే ఈ బైక్‌ను వినియోగదారులు సొంతం చేసుకోవచ్చు.
ఇక ఈ బైక్ ఫీచర్లను గమనిస్తే ఇందులో 249 సీసీ ఇంజన్ పొందుపరిచారు. ఇది 18.7 బిహెచ్‌పీ, 19ఎన్ఎమ్‌లను ఉత్పత్తి చేస్తుంది. డ్యూయల్-ఛానల్ ఏబీఎస్‌తో ముందు, వెనుక డిస్క్‌లను కలిగి ఉంటుంది. రిమోట్ ఇంజన్ కట్ ఆఫ్, జియో ఫెన్స్, రైడ్ రికార్డుల నిర్వహణ, గరిష్ట వేగం నియంత్రణ వంటి ఫీచర్లున్నాయి. బైక్‌కి సంబంధించిన అధికారిక డెలివరీలు జూలై మధ్యలో ప్రారంభమవుతాయి. మ్యాట్ బ్లూ కలర్ ధర రూ. 2.89 లక్షలు కాగా, మ్యాట్ డార్క్ గ్రే , మ్యాట్ బ్లాక్ ధరలు వరుసగా రూ. 2.99 లక్షలు , రూ. 3.09 లక్షలు (అన్నీ ఎక్స్-షోరూమ్ ఇండియా)గా కంపెనీ నిర్ణయించింది.
Comments
Please login to add a commentAdd a comment