
బీఎండబ్ల్యు కాన్సెప్ట్ బైక్.. గార్జియస్‌గా
జర్మనీ కార్ల దిగ్గజం బీఎండబ్ల్యు రూపొందించిన కాన్సెప్ట్ టూ వీలర్స్ త్వరలోనే రోడ్లపై హల్ చల్ చేయనున్నాయి. బీఎండబ్ల్యు మోటరాడ్ ద్వారా ద్విచక్ర వాహన రంగంలోకి ఎంట్రీ ఇచ్చిన సంస్థ ‘కాన్సెప్ట్ లింక్ ’ హై ఎండ్ బైక్‌ను లాంచ్ చేసింది. త‍్వరలోనే వీటిని భారత్‌లో ప్రవేశపెట్టనుంది. టైటానియం, సెమి మ్యాట్ బ్లాక్ బాడీతో, ఆరెంజ్ కలర్ ఇంటీరియర్‌తో డిజైన్‌తో సెమీ ఎక్స్‌పోజ్డ్ ఇంటీరియర్ డ్రైవ్ యూనిట్, విత్ కూలింగ్‌రిబ్స్ ,టచ్ సెన్సిటివ్ జాకెట్టు ప్రధాన ఫీచర్లుగా ఇది బైక్ రైడర్స్‌ను ఆకట్టుకోనుంది. జీరో ఎమిషన్స్ తో గార్జియస్ లుక్స్ లో వస్తున్న "కాన్సెప్ట్ లింక్" ఈ బైక్ ను మోటార్ సైకిల్ లేదా స్కూటర్ అని పిలవడానికి మాత్రం బీఎండబ్ల్యు ఇష్టపడకపోవడం విశేషం.
బీఎండబ్ల్యు మోటారాడ్ డిజైన్ హెడ్ అడ్గర్ హీన్రిచ్ ప్రకారం, "కాన్సెప్ట్ లింక్" బైక్ డిజిటల్ అండ్ అనలాగ్ ప్రపంచాలను అనుసంధానిస్తుంది. రైడర్ ప్రయాణ అవసరాలపై దృష్టి కేంద్రీకరిస్తూ, డిజిటైజేషన్ను అనుసంధానిస్తుంది. ఒక వాహనాంగానే కాకుండా కమ్యూనికేషన్ డివైస్ లా రైడర్‌కు సహకరిస్తుంది. దీంతో విండ్ షీల్డ్ మీద డిస్ ప్లే సమాచారం ద్వారా దగ్గర గమ్యాన్ని లేదా ప్రకృతి సౌందర్యంతో కూడిన రూటును ఎంచుకునే సౌలభ్యం. అలాగే ఎడ్జస్టబుల్ సీట్, సీక్రెట్ లగేజ్ కంపార్ట్‌మెంట్ తదితర ఫీచర్లు ఇందులో ఉన్నాయి.