
సాక్షి, న్యూఢిల్లీ : జర్మన్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ బీఎండబ్ల్యూ కు చెందిన ద్విచక్ర వాహన సంస్థ బీఎండబ్ల్యూ మోటరాడ్ ప్రీమియం మోటార్ బైక్‌ను భారతమార్కెట్లో విడుదల చేసింది. బీఎండబ్ల్యూ ఎస్ 1000 ఎక్స్‌ఆర్ పేరుతో గురువారం లాంచ్ చేసింది. ఈ అడ్వెంచర్ స్పోర్ట్ బైక్ ధర 20.9 లక్షల రూపాయలగా నిర్ణయించింది. తమ డీలర్ నెట్‌వర్క్‌లో గురువారం నుంచి పూర్తిగా బిల్ట్-అప్ యూనిట్ (సీబీయు)గా ఈ బైక్‌ను ఆర్డర్ చేయవచ్చని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. (ఆడి కొత్తకారు వచ్చేసింది)
కొత్త 999 సీసీ 4 సిలిండర్ ఇన్-లైన్ ఇంజిన్‌తో నడిచే ఈ బైక్ 11000 ఆర్‌పీఎం వద్ద 165 హెచ్‌పీని ఉత్పత్తిని అందిస్తుంది. గంటకు 0-100 కిమీ నుండి గంటకు 3.3 సెకన్లలో గరిష్ట వేగాన్ని అందుకుంటుంది. గంటకు 200 కిలొమీటర్ల వేగంతో దూసుకుపోతుంది. తమ సరికొత్త స్పోర్టీ రైడ్ బైక్ కొత్త సస్పెన్షన్ సిస్టమ్,సరికొత్త రైడింగ్ డైనమిక్స్ ఇంజనీరింగ్ ,రాజీలేని ఎర్గోనామిక్స్ తో విస్మయం కలిగించే పనితీరును కనబరుస్తుందని బీఎండబ్ల్యూ గ్రూప్ ఇండియా యాక్టింగ్ ప్రెసిడెంట్ అర్లిండో టీక్సీరా చెప్పారు. తొలిసారిగా అందిస్తున్న డైనమిక్ బ్రేక్ అసిస్టెంట్ డీబీసీ (డైనమిక్ బ్రేక్ కంట్రోల్) బ్రేకింగ్ ఫీచర్ విన్యాసాల సమయంలో రైడర్‌కు మద్దతు ఇస్తుందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment