Gorgeous
-
పెళ్లి కూతురిలా ముస్తాబైన జాన్వీ కపూర్ సిస్టర్ (ఫోటోలు)
-
శోభిత పెళ్లి ముచ్చట్లు : మహారాణిలా పెళ్లికూతురి లుక్స్ (ఫోటోలు)
-
గులాబీ రంగు చీరలో అందాల ‘రాశీ’ ఖన్నా (ఫొటోలు)
-
నెట్ చీరలో అందాల వల వేస్తున్న జాన్వీ కపూర్ (ఫొటోలు)
-
దీపావళి పటాకా మాదిరి గ్లామర్‌తో పేల్చేసిన హన్సిక (ఫోటోలు)
-
చీరలో తృప్తి దిమ్రి గ్లామర్ ట్రీట్.. గోల్డెన్ అవర్‌లో అలా (ఫొటోలు)
-
కళ్లు చెదిరే చీర అందాలు... ప్రేమమ్ బ్యూటీ (ఫొటోలు)
-
Mehreen Pirzada: చాలా రోజుల తర్వాత గ్లామర్ ట్రీట్ ఇచ్చిన మెహరీన్ (ఫోటోలు)
-
రంగులతో ఎంత మాయో.?
-
రెక్కలే రాని సీతాకోకచిలుక
పెరట్లో పూలమొక్కలను పరిశీలించి చూస్తోంది పింకీ. గన్నేరు చెట్టు ఆకు మీద ఏదో అతుక్కుని ఉన్నట్లనిపించింది. అమ్మని పిలిచి అదేమిటని అడిగింది. ‘‘అది సీతాకోకచిలుక గుడ్డులా ఉంది. దాన్ని ఏమీ చేయకు. ప్రతిదీ నీకే కావాలి. వెళ్లి చదువుకోపో’’ అని కోప్పడింది అమ్మ. ఓహో! ప్యూపా దశ అన్నమాట అని స్కూలు పాఠాన్ని గుర్తు చేసుకుంది పింకీ. అంతలోనే అమ్మ గద్దింపుతో చిన్నబుచ్చుకున్న పింకీ దగ్గరకు వెళ్లింది నానమ్మ. తనను బుజ్జగిస్తూ, చెవిలో ఏదో చెప్పింది. సంతోషంతో పింకీ కళ్లు మెరిశాయి. అమ్మ చూడకుండా ఆకును తెంచి, పాత జామెట్రీబాక్స్‌లో పెట్టింది. దానికి గాలి ఆడేందుకు వీలుగా పైన చిన్న రంధ్రాలు చేసింది. కొద్దిరోజులు గడిచాయి. ఓ రోజు పొద్దున్నే లేచిన పింకీ అగ్గిపెట్టె తెరిచేసరికి గుడ్డులో కదలిక కనపడింది. కాసేపటికి చిన్ని సీతాకోకచిలుక నెమ్మదిగా ఆ గుడ్డును పగులగొట్టుకుని బయటకు రావడం కనిపించింది. మరికొద్దిసేపటిలో దాదాపు ముప్పాతిక భాగం పైగా గుడ్డు నుంచి బయటికొచ్చింది. అయితే కొద్దిభాగం గుడ్డుకే అతుక్కుని ఉండడంతో దానికి సాయం చేద్దామని ఒక కత్తెర తెచ్చి నెమ్మదిగా దాన్ని కత్తిరించింది పింకీ. దాంతో పూర్తిగా బయటికొచ్చేసింది సీతాకోకచిలుక. అయితే ఎందుకోగాని అది ఎగరాలని ప్రయత్నించడం, ఎగరలేక కిందపడిపోవడం... జరుగుతుండేసరికి దీని సంగతి సాయంత్రం చూద్దాం లే అని బడికెళ్లిపోయింది. సాయంత్రం రాగానే బాక్స్ తెరిచి చూసింది. పాపం! దాని రెక్కలు సగం సగమే ఉన్నాయి. రెండు కాళ్లు కూడా లేవు. అందుకే అది ఎగరలేకపోతోందన్నమాట! బిక్కముఖం వేసింది పింకీ. వెక్కుతూ నానమ్మ దగ్గరకు వెళ్లింది. పింకీ చెప్పినదంతా విన్న నానమ్మ తనను దగ్గరకు తీసుకుని తలనిమురుతూ, ‘‘గుడ్డు నుంచి బయటికొచ్చేటప్పుడు దానిని పగలగొట్టుకునేందుకు చేసే ప్రయత్నమే దానికి తగిన బలాన్నిస్తుంది. నువ్వేమో సాయం చేద్దామనుకుని దాన్ని కత్తిరించేశావు. అందుకే దానికి రెక్కలు సరిగా రాలేదు. ఇప్పుడైనా కొంచెం ఓపిక పట్టు. కొన్నాళ్లకు బలం పుంజుకుని అదే ఎగిరిపోతుందిలే’’ అని బుజ్జగించింది. ‘సరే’నన్నట్లు తలూపింది పింకీ. ప్రతి ప్రాణికీ జీవించడానికి అవసరమైన శక్తిసామర్థ్యాలను ప్రకృతే ప్రసాదిస్తుంది. మనం అర్థం చేసుకుని ఓపిక పట్టాలి. పిల్లల హోమ్ వర్క్ తామే చేయడం, వారి పుస్తకాల సంచిని తామే మోయడం, ఆటలాడుకుంటే దెబ్బలు తగులుతాయని ఎక్కడికీ పంపకపోవడం వంటి వాటి వల్ల పెద్దయినా వారిలో ఏ పనీ సొంతగా చేయలేకపోవడం, అతి సుకుమారంగా తయారు కావడం వంటివి జరుగుతాయి. అలాగని పూర్తిగా వదిలేయమని, సాయం చేయవద్దనీ కాదు. ఎంతవరకో అంతే చేయాలి. – డి.వి.ఆర్. -
'గుర్తుకొస్తున్నాయి'... : ఎమ్మెల్యే
జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్) : చిన్నప్పుడు ఆడిన గోలీల ఆటను ఒక్కసారి ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ గుర్తు చేసుకున్నారు. మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని మోడ్రన్ రైతు బజార్ పనులను శనివారం పరిశీలించిన ఎమ్మెల్యే తిరిగి బయలుదేరారు. ఆ సమయంలో అక్క డే గోలీలు ఆడుకుంటున్న చిన్నారులను చూసిన ఆయన పరిశీలిస్తుండగా.. వారు మీరు కూడా ఆడతారా అంటూ అడిగారు. దీంతో ఎమ్మెల్యే వారి వద్ద నుంచి గోలీ తీసుకుని కాసేపు సరదాగా ఆడారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ తన చిన్నతనంలో ఇలాంటి ఆటలకు ప్రాధాన్యత ఉండేదని గుర్తు చేసుకున్నారు. కానీ ఇప్పటి తరం ఇండోర్ గేమ్స్, కంప్యూటర్లకే పరిమిత మవుతున్నారని తెలిపారు. అయితే, వేసవి సెలవుల సందర్భంగా పిల్లల విషయమై తల్లిదండ్రులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ సూచించారు. -
సంగీత్ వేడుకలో తమన్నా
ముంబై: టాలీవుడ్ అందాల తార తమన్నా భాటియా సోదరుడి మెహందీ ఫంక్షన్లో తళుక్కున మెరిసింది. తమన్నా సోదరుడు, అమెరికాలో డాక్టర్‌గా పనిచేస్తున్న ఆనంద్ భాటియా వివాహం కృతికా చౌదరితో త్వరలో జరగనుంది. ఈ నేపథ్యంలో జూన్29న శుక్రవారం ముంబైలో అత్యంత ఉత్సాహంగా సంగీత్ వేడుక జరిగింది. ఈ సంగీత్ వేడుకలో అమ్మడు స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలించింది. మెహిందీ చేతులతో మురిసిపోతూ, గార్జియస్ తమన్నా అభిమానులకు కనువిందు చేసింది. ప్రస్తుతం తమన్నా ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. మిల్కీ బ్యూటీ తమన్నా అందం, అభినయంతో తెలుగు, తమిళ, హిందీ భాషలలో వరుస ఆఫర్లతో దూసుకుపోతోంది. వైవిధ్యమైన పాత్రలతో ప్రేక్షకులను అలరిస్తోంది. ప్రధానంగా బాహుబలి మొదటి భాగంలో అవంతిక పాత్ర ద్వారా పలువురిని ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. -
హన్సిక ఆ లుక్ చూస్తే..
హైదరాబాద్: బొద్దుగుమ్మ తాజా సినిమా లుక్ అదిరిపోతోంది. టాలీవుడ్ హీరో గోపిచంద్ ప్రధాన పాత్రలో సంపత్ నంది తెరకెక్కిస్తున్న గౌతమ్ నంద చిత్రంలో అదిరిపోయే లుక్ తో ఆకర్షణీయంగా కనిపిస్తోంది. శ్రీబాలాజీ సినీ మీడియా పతాకంపై జె.భగవాన్, జె.పుల్లారావ్లు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ స్టైలిష్ యాక్షన్ ఎంటర్ టైనర్లో కేథరీన్ కూడా నటిస్తోంది. ఇప్పటికే కేథరిన్ క్యారెక్టర్‌ను ఇంట్రడ్యూస్ చేసింది చిత్ర బృందం. తాజాగా హన్సిక ఫోటోను దర్శకుడు ట్విట్టర్ లో అభిమానులతో పంచుకున్నారు. స్పూర్తి పాత్రలో అలరించనున్న హన్సికను దర్శకుడు ట్విట్టర్ లో పరిచయం చేశారు. మూవీ ప్రమోషన్ లో భాగంగా సినిమాలోని ప్రధాన పాత్రలకి సంబంధించి ఫస్ట్ లుక్స్ రివీల్ చేస్తోంది చిత్ర యూనిట్. తంబూర పట్టుకొని గార్జియస్‌గా ఉన్న హన్సిక రావిషింగ్ లుక్ చూసి ఫ్యాన్స్ ఫిదా అయిపోతున్నారు. కాగా ఇప్పటికే ఈ చిత్ర షూటింగ్ పూర్తి కాగా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటుంది. థమన్ సంగీతం అందించగా వచ్చే నెలలో ఈ చిత్రం రిలీజ్ కి ప్లాన్ చేస్తోంది చిత్ర యూనిట్. మరోవైపు ఇటీవల విడుదలైన టీజర్, సాంగ్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. త్వరలో ఆడియో వేడుకను గ్రాండ్ నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారు. @ihansika as #Spoorthi from Sampath Nandi's #Gopichand, @CatherineTresa1 starrer #GauthamNanda. pic.twitter.com/H1G7XYw9gP — Bhuva (@bhuvan1190) June 23, 2017 -
గురుకులాల్లో’ ప్రవేశాలకు కౌన్సెలింగ్
మిర్యాలగూడ రూరల్ : ఉమ్మడి జిల్లాలోని తెలంగాణ గిరిజన బాలబాలికల జూనియర్ కళాశాలల్లో 2017–18 ప్రథమ సంవత్సరంలో ప్రవేశానికి బుధవారం అవంతీపురం బాలుర కళాశాలలో కౌన్సెలింగ్ ప్రశాంతంగా సాగింది. అవంతీపురం బాలుర కళాశాల, దామరచర్ల, తుంగతుర్తి బాలికల జూనియర్ కళాశాలల్లో ప్రవేశానికి ఉమ్మడి కౌన్సెలింగ్ నిర్వహించారు. కౌన్సెలింగ్‌కు 400 మంది విద్యార్థులు హాజరయ్యారు. విద్యార్థుల ఎస్ఎస్సీ సర్టిఫికెట్లతో పాటు, కుల, ఆదాయ, ఆధార్ జీరాక్స్‌లను పరిశీలించారు. జిల్లా కోఆర్డి నేటర్ నూనె కరుణాకర్ పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో దామరచర్ల ప్రిన్సిపాల్ రాజ్‌గోపాల్, అజయ్, జాను నాయక్, వెంకన్న తదితరులు పాల్గొన్నారు. -
బీఎండబ్ల్యు కాన్సెప్ట్ బైక్.. గార్జియస్‌గా
-
బీఎండబ్ల్యు కాన్సెప్ట్ బైక్.. గార్జియస్‌గా
జర్మనీ కార్ల దిగ్గజం బీఎండబ్ల్యు రూపొందించిన కాన్సెప్ట్ టూ వీలర్స్ త్వరలోనే రోడ్లపై హల్ చల్ చేయనున్నాయి. బీఎండబ్ల్యు మోటరాడ్ ద్వారా ద్విచక్ర వాహన రంగంలోకి ఎంట్రీ ఇచ్చిన సంస్థ ‘కాన్సెప్ట్ లింక్ ’ హై ఎండ్ బైక్‌ను లాంచ్ చేసింది. త్వరలోనే వీటిని భారత్‌లో ప్రవేశపెట్టనుంది. టైటానియం, సెమి మ్యాట్ బ్లాక్ బాడీతో, ఆరెంజ్ కలర్ ఇంటీరియర్‌తో డిజైన్‌తో సెమీ ఎక్స్పోజ్డ్ ఇంటీరియర్ డ్రైవ్ యూనిట్, విత్ కూలింగ్రిబ్స్ ,టచ్ సెన్సిటివ్ జాకెట్టు ప్రధాన ఫీచర్లుగా ఇది బైక్ రైడర్స్‌ను ఆకట్టుకోనుంది. జీరో ఎమిషన్స్ తో గార్జియస్ లుక్స్ లో వస్తున్న "కాన్సెప్ట్ లింక్" ఈ బైక్ ను మోటార్ సైకిల్ లేదా స్కూటర్ అని పిలవడానికి మాత్రం బీఎండబ్ల్యు ఇష్టపడకపోవడం విశేషం. బీఎండబ్ల్యు మోటారాడ్ డిజైన్ హెడ్ అడ్గర్ హీన్రిచ్ ప్రకారం, "కాన్సెప్ట్ లింక్" బైక్ డిజిటల్ అండ్ అనలాగ్ ప్రపంచాలను అనుసంధానిస్తుంది. రైడర్ ప్రయాణ అవసరాలపై దృష్టి కేంద్రీకరిస్తూ, డిజిటైజేషన్‌ను అనుసంధానిస్తుంది. ఒక వాహనాంగానే కాకుండా కమ్యూనికేషన్ డివైస్ లా రైడర్‌కు సహకరిస్తుంది. దీంతో విండ్ షీల్డ్ మీద డిస్ ప్లే సమాచారం ద్వారా దగ్గర గమ్యాన్ని లేదా ప్రకృతి సౌందర్యంతో కూడిన రూటును ఎంచుకునే సౌలభ్యం. అలాగే ఎడ్జస్టబుల్ సీట్, సీక్రెట్ లగేజ్ కంపార్ట్మెంట్ తదితర ఫీచర్లు ఇందులో ఉన్నాయి. -
ఈ మహిళా నేతలను చూస్తే ఫిదా అవ్వాల్సిందే..
సాధారణంగా ఒక అందమైన అమ్మాయి లేదా మహిళ అనగానే ప్రతి ఒక్కరికి ఓ మోడల్ లేదా ఓ సినీ నటి గుర్తొస్తుంది. అలా అందంగా ఉండేవారు కూడా దాదాపు ఆ రంగాలనే ఎంచుకుంటారు. కానీ, రాజకీయాల్లో అలాంటి గార్జియస్ మహిళలను ఊహించడం సాధ్యమవుతుందా.. గతంలో ఏమోగాని ప్రస్తుతం మాత్రం అది సాధ్యమే.. చట్టసభల్లో కూడా ఒక్కసారి చూస్తే ఇక తలతిప్పుకోలేనంత అందమైన మగువలు దర్శనమిస్తున్నారు. వారికి ఉన్న గ్లామర్ కు తోడు వాక్చాతుర్యాన్ని కాస్త సానబెట్టుకొని ప్రచారంలో దూసుకెళ్లి సభల్లో అడుగుపెట్టి తళుక్కున మెరిసిపోతున్నారు. అలా ఇప్పటి వరకు ప్రపంచంలోని రాజకీయ క్షేత్రంలో టాప్ పదిమంది గార్జియస్ మహిళల్ని ఒకసారి పరిశీలిస్తే.. 1.నికోలే మినేటి ఈమె ఇటలీకి చెందిన గ్లామరస్ పొలిటిషియన్. 2010 నుంచి 2012 మధ్యకాలంలో పీడీఎల్ పార్టీ తరుపున రీజినల్ కౌన్సిల్ మెంబర్‌గా సభలో అడుగుపెట్టింది. 2.వంజా హాడ్జోవిక్ ఈమె సెర్బియా విదేశాంగ వ్యవహారాల సలహాదారు. ఈమెకు ఇంటర్నెట్లో సునామీలాంటి ఫాలోయింగ్ ఉంది. 3.ఈవా కైలీ ఈమె గ్రీస్ పార్లమెంటులో గ్లామరస్ రాజకీయ నేత. 2007 నుంచి పలు శాఖల్లో బాధ్యతలు నిర్వహిస్తోంది. 4.ఎమ్మా కైర్నాన్ ఈమె ఐర్లాండ్ నాయకురాలు. ఐర్లాండ్ ప్రభుత్వంలో ఇప్పటి వరకు ఈమె అందమైన యువ మహిళ. 5.అన్నా మరియా గాలోజన్ ఈమె ఈస్టోనియాకు చెందిన నేత. 2009లో రాజకీయ రంగంలో అడుగుపెట్టింది 6.వర్లీ లెవీ ఈమె ఇజ్రెయల్ నాయకురాలు. న్యాయపట్టా పొందిన ఈమె ఇజ్రాయెల్ ఎయిర్ ఫోర్స్ మెంబర్ గా కూడా ఉన్నారు. 7.సెత్రిగా గియాగియా ఈమె లెబనాన్ పార్లమెంటులో గ్లామరస్ నేత 8.సబైన ఉస్లాగ్ ఈమె డచ్ నాయకురాలు. సమాజం కోసం ఎక్కువగా పనిచేస్తున్న వ్యక్తిగా మంచి పేరు ఉంది. 9.యూరి ఫుజికావ ఈమె జపాన్‌లోని హాషినోహ్ నగర మండలి సభ్యురాలు. ఓ నాయకుడిని పెళ్లి చేసుకోవడం ద్వారా నాయకురాలిగా మారింది. 10.క్వీన్ రానియా ఈమె జోర్డాన్ కు చెందిన యువ మహిళా నాయకురాలు. కువైట్ లో జన్మించిన ఈమె సిటీ బ్యాంక్, ఆపిల్ సంస్థల్లో పని చేసి చివరకు రాజు అబ్దుల్లాను వివాహం చేసుకొని నేతగా మారింది.