హన్సిక ఆ లుక్‌ చూస్తే.. | Introducing Gorgeous @ihansika as #Spoorthi From #GautamNanda | Sakshi
Sakshi News home page

హన్సిక ఆ లుక్‌ చూస్తే..

Published Fri, Jun 23 2017 4:13 PM | Last Updated on Tue, Sep 5 2017 2:18 PM

హన్సిక ఆ లుక్‌ చూస్తే..

హన్సిక ఆ లుక్‌ చూస్తే..

హైదరాబాద్‌:  బొద్దుగుమ్మ తాజా సినిమా లుక్‌ అదిరిపోతోంది.  టాలీవుడ్‌ హీరో గోపిచంద్ ప్ర‌ధాన పాత్ర‌లో సంపత్ నంది తెర‌కెక్కిస్తున్న గౌత‌మ్ నంద‌ చిత్రంలో అదిరిపోయే లుక్‌ తో ఆకర్షణీయంగా కనిపిస్తోంది. శ్రీబాలాజీ సినీ మీడియా పతాకంపై జె.భగవాన్, జె.పుల్లారావ్లు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ స్టైలిష్ యాక్షన్ ఎంటర్ టైనర్లో  కేథరీన్ కూడా నటిస్తోంది. ఇప్పటికే కేథరిన్ క్యారెక్టర్ను ఇంట్రడ్యూస్ చేసింది చిత్ర బృందం.   తాజాగా హన్సిక ఫోటోను   దర్శకుడు ట్విట్టర్‌ లో అభిమానులతో పంచుకున్నారు. స్పూర్తి  పాత్ర‌లో  అలరించనున్న హ‌న్సికను  దర్శకుడు ట్విట్టర్‌ లో పరిచయం చేశారు.  మూవీ ప్ర‌మోష‌న్ లో భాగంగా సినిమాలోని ప్ర‌ధాన పాత్ర‌ల‌కి సంబంధించి ఫ‌స్ట్ లుక్స్ రివీల్ చేస్తోంది చిత్ర యూనిట్. తంబూర‌ ప‌ట్టుకొని గార్జియస్‌గా ఉన్న హ‌న్సిక  రావిషింగ్‌ లుక్‌  చూసి ఫ్యాన్స్  ఫిదా అయిపోతున్నారు. 

కాగా  ఇప్ప‌టికే ఈ చిత్ర షూటింగ్ పూర్తి కాగా ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుపుకుంటుంది. థ‌మ‌న్ సంగీతం అందించ‌గా వ‌చ్చే నెల‌లో ఈ చిత్రం రిలీజ్ కి ప్లాన్ చేస్తోంది చిత్ర యూనిట్‌.  మరోవైపు  ఇటీవల విడుదలైన టీజర్, సాంగ్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. త్వరలో ఆడియో వేడుకను గ్రాండ్ నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement