సంగీత్‌ వేడుకలో తమన్నా | Look So gorgeous at her brother Anand Bhatia's sangeet ceremony | Sakshi
Sakshi News home page

సంగీత్‌ వేడుకలో తమన్నా

Published Sat, Jul 1 2017 3:37 PM | Last Updated on Tue, Sep 5 2017 2:57 PM

సంగీత్‌ వేడుకలో తమన్నా

సంగీత్‌ వేడుకలో తమన్నా

ముంబై:  టాలీవుడ్‌ అందాల తార  తమన్నా భాటియా  సోదరుడి  మెహందీ ఫంక్షన్లో  తళుక్కున మెరిసింది. త‌మ‌న్నా సోద‌రుడు, అమెరికాలో డాక్టర్‌గా పనిచేస్తున్న ఆనంద్ భాటియా  వివాహం  కృతికా చౌదరితో త్వరలో జరగనుంది.  ఈ నేపథ్యంలో జూన్‌29న  శుక్రవారం ముంబైలో  అత్యంత  ఉత్సాహంగా  సంగీత్‌  వేడుక జరిగింది.   ఈ సంగీత్‌  వేడుక‌లో అమ్మడు  స్పెషల్‌ ఎట్రాక్షన్‌ గా నిలించింది.  మెహిందీ చేతులతో మురిసిపోతూ, గార్జియస్‌ తమన్నా   అభి​మానులకు కనువిందు చేసింది.   ప్ర‌స్తుతం త‌మ‌న్నా ఫోటోలు సోష‌ల్ మీడియాలో చక్కర్లు  కొడుతున్నాయి.

మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా అందం, అభినయంతో తెలుగు, తమిళ,  హిందీ  భాష‌ల‌లో వరుస ఆఫర్లతో దూసుకుపోతోంది.  వైవిధ్య‌మైన  పాత్రలతో  ప్రేక్షకులను అలరిస్తోంది.  ప్రధానంగా బాహుబ‌లి మొదటి భాగంలో అవంతిక పాత్ర ద్వారా  పలువురిని  ఆకట్టుకున్న సంగతి తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement