కథ విన్నప్పుడే అలా ఫిక్సయ్యా! | When you hear the story, Fixi - gopichand | Sakshi
Sakshi News home page

కథ విన్నప్పుడే అలా ఫిక్సయ్యా!

Published Sun, Jul 23 2017 12:54 AM | Last Updated on Tue, Sep 5 2017 4:38 PM

కథ విన్నప్పుడే అలా ఫిక్సయ్యా!

కథ విన్నప్పుడే అలా ఫిక్సయ్యా!

‘‘ఎవరైనా డబ్బులు పెట్టి సినిమాలు తీసేది డబ్బులు సంపాదించుకోవడం కోసమే. సినిమా తీసినవాళ్లూ, కొన్నవాళ్లూ హ్యాపీగా ఉండాలి. సొంత ఇష్టాల కోసం ఎవరినో మాయ చేసి సినిమాలు చేస్తుంటే కొన్నాళ్ల తర్వాత మనతో సినిమా తీయడానికి ఎవరూ ముందుకు రారు’’ అన్నారు గోపీచంద్‌. ఆయన హీరోగా సంపత్‌ నంది దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘గౌతమ్‌నంద’. జె. భగవాన్, జె. పుల్లారావ్‌ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 28న విడుదల కానుంది. ఈ సందర్భంగా గోపీచంద్‌ చెప్పి విశేషాలు...

►గౌతమ్‌.. గౌతమ్‌నందాగా ఎలా మారాడు? అన్నదే కథ. ఆడియో ఫంక్షన్‌లో సినిమా హిట్టవుతుందని అంత కాన్ఫిడెంట్‌గా చెప్పానంటే అందుకు కారణం కథే. ఈ సినిమాకి కథే హీరో. విన్నప్పుడే మంచి కథ అనిపించింది. సంపత్‌ కూడా కథను అలానే ఎగ్జిక్యూట్‌ చేశారు.
∙నేను చెసిన మంచి సినిమాల్లో ఇదొకటని చెప్పగలను. నా లుక్‌ డిఫరెంట్‌గా ఉంటుంది. డైరెక్టర్‌ కాస్ట్యూమ్స్, హెయిర్‌ స్టైల్‌ కొత్తగా డిజైన్‌ చేయించారు. అవి చూసి నేనే షాకయ్యాను. ఇన్ని రోజులు ఇలా చేయకుండా ఎందుకు వేస్ట్‌ చేశానా? అనిపించింది.
∙సంపత్‌ సినిమాలు ‘బెంగాల్‌ టైగర్‌’, ‘రచ్చ’ చూశా. వాటిలో హీరోలను ఎలివేట్‌ చేసే సీన్స్‌ సూపర్‌గా ఉంటాయి. పక్కా కమర్షియల్‌ మీటర్‌ సినిమాలవి. అలాంటి కథ చెబుతారేమో అనుకున్నా. కానీ కమర్షియల్‌ అంశాలతో డిఫరెంట్‌ స్టోరీ చెప్పారు. సంపత్‌ చేసిన సినిమాల్లో ఇది బెస్ట్‌ స్టోరీ అని చెప్పగలను. కథ విన్నప్పుడే హిట్‌ అని ఫిక్సయ్యా.

►ఈ సినిమాకు భారీ బడ్జెట్‌ అవ్వలేదు. ముందు ఒక బడ్జెట్‌ అనుకున్నారు. అంతలోనే తీశాం. నిర్మాతలు టేబుల్‌ ప్రాఫిట్‌లో ఉన్నారు. కొనుక్కున్నవాళ్లు కూడా హ్యాపీగా ఉండాలి. వాళ్లు ఒక నమ్మకంతో కొంటారు. ఆ నమ్మకాన్ని ఈ సినిమా నిలబెడుతుందనుకుంటున్నాను.

► నాకు బాగా సింక్‌ అయిన డైరెక్టర్లలో సంపత్‌ ఒకరు. సెట్‌లోకొచ్చాక డిస్కషన్స్‌ మాత్రమే. మార్పులు చేయలేదు. అంతలా వర్క్‌ చేశారు. అందుకే అవుట్‌పుట్‌ బాగా వచ్చింది. సంపత్‌ విజన్‌ను కెమెరామేన్‌ సౌందర్‌రాజన్‌ చక్కగా చూపించారు.

► నాన్నగారు (దర్శకుడు టి. కృష్ణ) తీసిన నేటి భారతం, వందేమాతరం, ప్రతిఘటన లాంటివి ఇప్పుడు చేస్తే పర్‌ఫెక్ట్‌గా చేయాలి. లేకపోతే నవ్వులపాలైపోతాం. నాన్నగారు అప్పట్లో సినిమాల్లో చూపించిన సమస్యలు ఇప్పుడూ ఉన్నాయి. అయితే వాటిని ఆడియన్స్‌కు నచ్చే విధంగా చూపించాలి. అలాంటి పాయింట్స్‌తో సినిమాలు తీయాలనుకునే డైరెక్టర్లు ఇప్పుడూ ఉంటారు. అయితే నన్నెవరూ ఎప్రోచ్‌ కాలేదు. వస్తే చేయాలని ఉంది.

► గతేడాది నా సినిమాలు రాలేదు. అంటే నా ప్లానింగ్‌లో ఏదో తేడా కొట్టింది. ఒక సినిమా మొదలవ్వాలన్నా, రిలీజ్‌ అవ్వాలన్నా నా ఒక్కడి చేతుల్లో ఉండదు. అన్నీ కుదరాలి. అవి కుదరకపోవడం వల్ల కాస్త లేట్‌ అయ్యింది. అయితే కాస్త లేట్‌ అయినా మంచి సినిమాతో రాబోతున్నానన్న తృప్తి ఉంది. ఒక సినిమా విడుదలయ్యాక మరో సినిమా రిలీజ్‌కు  ఏడాది గ్యాప్‌ తీసుకోవడం అనేది సింపుల్‌ మ్యాటర్‌ కాదు. అలా నాకు వృథాగా పోయిన సంవత్సరం తిరిగి రాదు కదా.

► నా దగ్గరకు మల్టీస్టారర్‌ సినిమాలు రాలేదు. కథ నచ్చితే రెడీనే. ఇప్పుడు హీరోగా చేసుకుంటూ వెళుతున్నాను. ప్రజెంట్‌ విలన్‌ రోల్స్‌ చేయాలనుకోవడం లేదు. ప్రస్తుతానికి తెలుగు సినిమాలకే పరిమితం కాదల్చుకున్నాను. తమిళంలో ఇప్పుడు కాదు.. తెలుగులో చేస్తే చాలు.

►ఇప్పుడు నాకు నా కొడుకు విరాట్‌కృష్ణ మెయిన్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌. షూటింగ్‌ లేకపోతే వాడితో నాకు సరిపోతుంది. అక్టోబర్‌లో మా నాన్నగారు చనిపోయారు. అక్టోబర్‌లో మా కొడుకు పుట్టాడు. అందుకే మా నాన్నగారే పుట్టారని నమ్ముతున్నాను.

► ప్రెజెంట్‌ డ్రగ్స్‌ అనేది ఇండస్ట్రీ హాట్‌ టాíపిక్‌  కాదు. స్టేట్‌వైజ్‌ టాపిక్‌. డ్రగ్స్‌ మంచిది కాదు. ప్రభుత్వం సరైన చర్యలు తీసుకుంటుందన్న నమ్మకం ఉంది. స్కూల్స్‌ దగ్గర కూడా అమ్ముతున్నారనీ, పిల్లలు తీసుకుంటున్నారనీ విన్నాను. బాధగా అనిపించింది. డ్రగ్స్‌ తీసుకోవడం వల్ల కుటుంబం నాశనం అవుతుంది. ∙ఒత్తడిని అధిగమించడానికి డ్రగ్స్‌ తీసుకోవాల్సిన అవసరం లేదు. మంచి సినిమా చూడొచ్చు. వ్యాయామం చేయచ్చు. లేకపోతే మంచి పుస్తకాలు చదువుకోవచ్చు. ఒత్తిడి లేకుండా ఏ ఫీల్డ్‌ ఉండదు? అంతమాత్రాన డ్రగ్స్‌ తీసుకోవడం కరెక్ట్‌ కాదు. బలహీనత వల్లే డ్రగ్స్‌ తీసుకుంటారని నా అభిప్రాయం. దాని వల్ల లాభం ఉండదు. భవిష్యత్‌ నాశనం అవుతుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement