ఈ మహిళా నేతలను చూస్తే ఫిదా అవ్వాల్సిందే.. | 10 Gorgeous Politicians You Cant get your Eyes off | Sakshi
Sakshi News home page

ఈ మహిళా నేతలను చూస్తే ఫిదా అవ్వాల్సిందే..

Published Sun, Jun 12 2016 12:06 PM | Last Updated on Mon, Sep 17 2018 5:17 PM

ఈ మహిళా నేతలను చూస్తే ఫిదా అవ్వాల్సిందే.. - Sakshi

ఈ మహిళా నేతలను చూస్తే ఫిదా అవ్వాల్సిందే..

సాధారణంగా ఒక అందమైన అమ్మాయి లేదా మహిళ అనగానే ప్రతి ఒక్కరికి ఓ మోడల్ లేదా ఓ సినీ నటి గుర్తొస్తుంది. అలా అందంగా ఉండేవారు కూడా దాదాపు ఆ రంగాలనే ఎంచుకుంటారు. కానీ, రాజకీయాల్లో అలాంటి గార్జియస్ మహిళలను ఊహించడం సాధ్యమవుతుందా.. గతంలో ఏమోగాని ప్రస్తుతం మాత్రం అది సాధ్యమే..

చట్టసభల్లో కూడా ఒక్కసారి చూస్తే ఇక తలతిప్పుకోలేనంత అందమైన మగువలు దర్శనమిస్తున్నారు. వారికి ఉన్న గ్లామర్ కు తోడు వాక్చాతుర్యాన్ని కాస్త సానబెట్టుకొని ప్రచారంలో దూసుకెళ్లి సభల్లో అడుగుపెట్టి తళుక్కున మెరిసిపోతున్నారు. అలా ఇప్పటి వరకు ప్రపంచంలోని రాజకీయ క్షేత్రంలో టాప్ పదిమంది గార్జియస్ మహిళల్ని ఒకసారి పరిశీలిస్తే..

1.నికోలే మినేటి
ఈమె ఇటలీకి చెందిన గ్లామరస్ పొలిటిషియన్. 2010 నుంచి 2012 మధ్యకాలంలో పీడీఎల్ పార్టీ తరుపున రీజినల్ కౌన్సిల్ మెంబర్గా సభలో అడుగుపెట్టింది.
2.వంజా హాడ్జోవిక్
ఈమె సెర్బియా విదేశాంగ వ్యవహారాల సలహాదారు. ఈమెకు ఇంటర్నెట్లో సునామీలాంటి ఫాలోయింగ్ ఉంది.
3.ఈవా కైలీ
ఈమె గ్రీస్ పార్లమెంటులో గ్లామరస్ రాజకీయ నేత. 2007 నుంచి పలు శాఖల్లో బాధ్యతలు నిర్వహిస్తోంది.
4.ఎమ్మా కైర్నాన్
ఈమె ఐర్లాండ్ నాయకురాలు. ఐర్లాండ్ ప్రభుత్వంలో ఇప్పటి వరకు ఈమె అందమైన యువ మహిళ.
5.అన్నా మరియా గాలోజన్
ఈమె ఈస్టోనియాకు చెందిన నేత. 2009లో రాజకీయ రంగంలో అడుగుపెట్టింది
6.వర్లీ లెవీ
ఈమె ఇజ్రెయల్ నాయకురాలు. న్యాయపట్టా పొందిన ఈమె ఇజ్రాయెల్ ఎయిర్ ఫోర్స్ మెంబర్ గా కూడా ఉన్నారు.
7.సెత్రిగా గియాగియా
ఈమె లెబనాన్ పార్లమెంటులో గ్లామరస్ నేత
8.సబైన ఉస్లాగ్
ఈమె డచ్ నాయకురాలు. సమాజం కోసం ఎక్కువగా పనిచేస్తున్న వ్యక్తిగా మంచి పేరు ఉంది.
9.యూరి ఫుజికావ
ఈమె జపాన్లోని హాషినోహ్ నగర మండలి సభ్యురాలు. ఓ నాయకుడిని పెళ్లి చేసుకోవడం ద్వారా నాయకురాలిగా మారింది.
10.క్వీన్ రానియా
ఈమె జోర్డాన్ కు చెందిన యువ మహిళా నాయకురాలు. కువైట్ లో జన్మించిన ఈమె సిటీ బ్యాంక్, ఆపిల్ సంస్థల్లో పని చేసి చివరకు రాజు అబ్దుల్లాను వివాహం చేసుకొని నేతగా మారింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement