ప్రముఖ బైక్ తయారీ సంస్థ బీఎండబ్ల్యూ మోటొరాడ్ (BMW Motorrad) సరికొత్త కాన్సెప్ట్ మోటార్‌సైకిల్ 'బీఎండబ్ల్యూ ఆర్20' ఆవిష్కరించింది. చూడటానికి చాలా అద్భుతంగా ఉన్న ఈ బైక్ ఓ ప్రత్యేకమైన డిజైన్ కలిగి.. చూడగానే ఆకర్శించే విధంగా ఉంది.
కొత్త బీఎండబ్ల్యూ ఆర్20 బైక్ 2000 సీసీ ఎయిర్ ఆయిల్ కూల్డ్ బాక్సర్ ఇంజన్‌ను పొందుతుంది. అయితే ఈ ఇంజిన్ పనితీరు గణాంకాలను కంపెనీ వెల్లడించలేదు. ఇంజన్ కొత్త సిలిండర్ హెడ్ కవర్లు, కొత్త బెల్ట్ కవర్, కొత్త ఆయిల్-కూలర్ కూడా ఉన్నాయి.
మోడ్రన్ క్లాసిక్ మోటార్‌సైకిల్ డిజైన్ కలిగిన ఈ బైక్ సరికొత్త గులాబీ రంగులో ఉంటుంది. సింగిల్ సీటును క్విల్టెడ్ బ్లాక్ ఆల్కాంటారా అండ్ ఫైన్-గ్రెయిన్ లెదర్‌లో అప్‌హోల్‌స్టర్ చేసారు. ఇందులో కొత్త ఎల్ఈడీ హెడ్‌లైట్, 3డీ ప్రింటెడ్ అల్యూమినియం రింగ్‌లో ఇంటిగ్రేటెడ్ డేటైమ్ రన్నింగ్ లైట్ వంటివి ఉన్నాయి.
బీఎండబ్ల్యూ ఆర్20 బైక్ 17 ఇంచెస్ ఫ్రంట్ స్పోక్ వీల్.. 17 ఇంచెస్ రియర్ బ్లాక్ డిస్క్ వీల్ పొందుతుంది. వెనుక టైర్ 200/55, ముందు టైరు 120/70 పరిమాణం పొందుతుంది. బీఎండబ్ల్యూ పారాలెవర్ సిస్టమ్ క్రోమ్-మాలిబ్డినం స్టీల్ స్వింగార్మ్, అల్యూమినియం పారాలెవర్ స్ట్రట్ ఇందులో ఉపయోగించారు. కాబట్టి రైడర్ మంచి రైడింగ్ అనుభూతిని పొందవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment