సాక్షి, ముంబై: రాయల్ ఎన్‌ఫీల్డ్ తన క్లాసిక్ 350 మోడల్ బైక్‌లో బడ్జెట్ ధరలో ఒక కొత్త వెర్షన్‌ను లాంచ్ చేసింది. క్లాసిక్ 350 ఎస్ పేరుతో తీసుకొచ్చిన ఈ బైక్ ధరను రూ .1.45 లక్షలు (ఎక్స్-షోరూమ్,న్యూఢిల్లీ) గా నిర్ణయించింది. క్లాసిక్ 350 లా డ్యూయల్-ఛానల్ ఏబీస్ మాదిరిగా కాకుండా క్లాసిక్ 350 ఎస్ లోని 'ఎస్' సింగిల్-ఛానల్ ఏబీఎస్‌ను సూచిస్తుంది.
ధర: ఈ క్లాసిక్ బైక్ 350 ధర రూ .1.54 లక్షల ధరతో పోలిస్తే కొత్త క్లాసిక్ 350 ఎస్ వెర్షన్ రూ.9 వేలు తక్కువ.
ఇంజిన్ వివరాలు: డిజైన్‌లోమార్పులు చేసినప్పటికీ, రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350 ఎస్ అదే 346 సీసీ సింగిల్ సిలిండర్ ఇంజిన్‌తో వస్తుంది. 5-స్పీడ్ ట్రాన్స్‌మిషన్‌తో ఇది 5,250 ఆర్‌పిఎమ్ వద్ద గరిష్టంగా 19.8 బిహెచ్‌పి, 4,000 ఆర్‌పిఎమ్ వద్ద 28 ఎన్‌ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేస్తుంది.
అలాగే, రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350 ఎస్ ముందు భాగంలో టెలిస్కోపిక్ ఫోర్క్ సస్పెన్షన్‌ను అమర్చగా, వెనుక భాగంలో ట్విన్ గ్యాస్ చార్జ్డ్ షాక్ అబ్జార్బర్స్ ఉన్నాయి. క్లాసిక్ 350 ఎస్ ముందు భాగంలో డిస్క్ బ్రేక్ , వెనుక భాగంలో ఇప్పుడు డ్రమ్ బ్రేక్ సెటప్ ఉంది. ఇది ప్యూర్ బ్లాక్, మెర్క్యురీ సిల్వర్ అనే రెండు రంగులలో అందుబాటులో ఉంది.
Comments
Please login to add a commentAdd a comment