
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ద్విచక్ర వాహన తయారీ సంస్థ రాయల్ ఎన్‌ఫీల్డ్ నూతన మోడల్ స్క్రామ్ 411ను భారత్‌లో ప్రవేశపెట్టింది. పరిచయ ఆఫర్‌లో భాగంగా చెన్నై ఎక్స్‌షోరూంలో ధర రూ.2.03 లక్షల నుంచి ప్రారంభం. రాయల్ ఎన్‌ఫీల్డ్ ఎల్‌ఎస్–410 ఇంజన్ ప్లాట్‌ఫామ్‌పై ఇది రూపుదిద్దుకుంది. 411 సీసీ ఇంజన్, 4 స్ట్రోక్ సింగిల్ సిలిండర్ ఇంజన్, 6,500 ఆర్‌పీఎంతో 24.3 బీహెచ్‌పీ పవర్, 32 ఎన్‌ఎం టార్క్‌తో 4,000–4,500 ఆర్‌పీఎం ఉంది.
ఇక ఈ బైక్‌లో ఫీచర్ల విషయానికి వస్తే డిజిటల్ అనలాగ్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, డ్యూయల్ చానెల్ యాంటీ బ్రేకింగ్ సిస్టమ్‌తో డిస్క్ బ్రేక్స్ పొందుపరిచారు. యూరప్, ఆసియా పసిఫిక్ దేశాల్లోనూ కొన్ని నెలల్లో ఈ మోడల్‌ను పరిచయం చేయనున్నట్టు కంపెనీ ప్రకటించింది.
Comments
Please login to add a commentAdd a comment