ప్రముఖ ఇటాలియన్ బైక్ల తయారీదారు డుకాటీ భారత మార్కెట్లలోకి నయా మాన్‌స్టర్ బైక్ మోడళ్లను లాంచ్ చేసింది. స్పోర్టీలుక్‌తో , తేలికగా, సులభంగా ప్రయాణించేలా రూపొందించిన డుకాటీ మాన్‌స్టర్ బైక్స్ ప్రియులకు సరికొత్త అనుభవాన్ని అందించనుంది. డుకాటీ మాన్‌స్టర్, మాన్‌స్టర్ ప్లస్ అనే రెండు వేరియంట్లు కొనుగోలుదారులకు అందుబాటులో ఉండనుంది.
చదవండి: జేమ్స్‌బాండ్-007 భాగస్వామ్యంతో స్పెషల్ ఎడిషన్ బైక్..!
డుకాటీ మాన్‌స్టర్ వేరియంట్ ధర రూ.10.99 లక్షలు, డుకాటీ మాన్‌స్టర్ ప్లస్ వేరియంట్ ధర రూ.11.24 లక్షలుగా ఉంది(ఎక్స్ షోరూమ్). న్యూ డుకాటి మాన్‌స్టర్ రెడ్, డార్క్ స్టీల్త్‌లో బ్లాక్ వీల్స్, ఏవియేటర్ గ్రేతో జీపీ రెడ్ వీల్స్‌తో అందుబాటులో ఉంది. ప్లస్ వెర్షన్ కూడా అదే రంగుల్లో లభిస్తుంది. అంతేకాకుండా డుకాటీ మాన్‌స్టర్ ఏరోడైనమిక్ విండ్‌షీల్డ్ తో రానుంది.
ఎంబెడెడ్ రౌండ్ హెడ్‌ల్యాంప్, బైసన్ బ్యాక్ ఇన్‌స్పైర్డ్ చంకీ ఫ్యూయల్ ట్యాంక్, క్లీన్ టెయిల్ సెక్షన్ , సెంటర్ పొజిషన్డ్ ఇంజిన్ వంటి మాన్‌స్టర్ డిజైన్ ఎలిమెంట్‌లతో ఈ బైక్స్‌ను తయారుచేశారు. డుకాటీ న్యూ మాన్‌స్టర్ లైట్‌వేట్‌గా 166కేజీలు ఉంటుందని కంపెనీ పేర్కొంది. అంతకుముందు వచ్చిన బైక్ కంటే 60 శాతం తక్కువ బరువులో చాసిస్ ఉందని డుకాటీ తెలిపింది. గ్లాస్ ఫైబర్ రీన్ఫోర్స్డ్ పాలిమర్‌తో బైక్ ఫ్రేమ్‌ను తయారుచేశారు. డెస్మోడ్రోమిక్ టెక్నాలజీతో కొత్త టెస్టాస్ట్రెట్టా 11 డిగ్రీల 937సీసీ ఎల్ ట్విన్ ఇంజిన్‌ను డుకాటీ మాన్‌స్టర్ అమర్చారు. 111 హెచ్‌పీ సామర్థ్యంతో 9,250 ఆర్‌పీఎమ్ వద్ద 93ఎన్‌ఎమ్ టార్క్‌ను ఉత్పత్తిచేయనుంది.
The New Monster arrives in 3 fun colours:
— Ducati India (@Ducati_India) September 23, 2021
The all-time classic Ducati Red
The playful Aviator Grey
And of course, the mysterious Dark Stealth.
Now available in India with prices starting at INR 10,99,000 Lacs (Ex-Showroom India).#NewMonster #JustFun pic.twitter.com/dOadyWnGY5
చదవండి: ఈ టైర్లు అసలు పంక్చరే కావు..!
Comments
Please login to add a commentAdd a comment