హోండా యూనికార్న్.. కొత్త వేరియంట్ | Honda launches new CB Unicorn 160 at Rs 69350 | Sakshi
Sakshi News home page

హోండా యూనికార్న్.. కొత్త వేరియంట్

Published Fri, Dec 19 2014 12:20 AM | Last Updated on Sat, Sep 2 2017 6:23 PM

హోండా యూనికార్న్.. కొత్త వేరియంట్

హోండా యూనికార్న్.. కొత్త వేరియంట్

రెండు వేరియంట్లలో లభ్యం
ధరలు రూ. 69,350, రూ.74,414

 
న్యూఢిల్లీ: హోండా కంపెనీ యూనికార్న్‌లో కొత్త వేరియంట్‌ను మార్కెట్లోకి తెచ్చింది. ఈ కొత్త 163 సీసీ సీబీ యూనికార్న్‌ను వచ్చే నెల మూడో వారం నుంచి విక్రయిస్తామని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ ఏడాది తామందిస్తున్న నాలుగో ఆవిష్కరణ ఈ బైక్ అని హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా ప్రెసిడెంట్, సీఈఓ కీత మురమత్సు పేర్కొన్నారు. స్టాండర్డ్ (ధర రూ.69,350), సీబీఎస్(ధర రూ.74,414; ఈ రెండు ధరలు ఎక్స్ షోరూమ్, ఢిల్లీ) అనే రెండు వేరియంట్లలో ఈ బైక్‌ను అందిస్తున్నామని వివరించారు.

హోండా ఈకో టెక్నాలజీతో రూపొందిన ఈ బైక్ లీటర్‌కు 62 కి.మీ. మైలేజీనిస్తుందని తెలిపారు.  స్టైల్, ఫ్యాషన్ కోరుకునే యువత కోసం ఈ బైక్‌ను రూపొందించామని కంపెనీ వైస్ ప్రెసిడెంట్(సేల్స్, మార్కెటింగ్) వై.ఎస్.గులేరియా చెప్పారు. కాంబి-బ్రేక్ సిస్టమ్, బీమింగ్ హెడ్‌లైట్, స్టైలిష్ హెచ్- షేప్ ఎల్‌ఈడీ టెయిల్ లైట్ తదితర ఫీచర్లున్నాయని తెలిపారు. నాలుగు ఆకర్షణీయమైన రంగుల్లో ఈ బైక్‌ను అందిస్తున్నామని వివరించారు. వచ్చే ఏడాది 10 కొత్త టూవీలర్లను(ఇందులో 7 కొత్త మోడళ్లు) విడుదల చేస్తామని వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement